కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు (Tenth Exams) నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వైరస్ ప్రాభవం తగ్గడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పరీక్షల (TS 10th Exams 2022) నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు (Minister harish rao), సబితా ఇంద్రారెడ్డిలు (Sabita Indra reddy) విద్యార్థులకు Wishes చెప్పారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ప్రభుత్వం పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక తరగతులు (Special classes) నిర్వహించామని.. ఇందుకు జిల్లా యంత్రాంగం అన్ని వసతులు కల్పించామని చెప్పారు. మీరు కూడా కష్ట పడి చదివారు. మీ కష్టం వృథా కాదు.. మీ భవిష్యత్తు పునాది పదవ తరగతే అన్నారు. ఇష్టపడి.. ఆత్మవిశ్వాసంతో రాయండి.. ఉత్తమ ఫలితాలు సాధించి మీ అమ్మ నాన్నల ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
‘‘మీరు విజేతలుగా నిలవాలని ఆశీర్వాదిస్తూ నేను ఉత్తరాలు (Letters) పంపించాను. వాటికి మీ నుంచి, మీ తల్లిదండ్రుల నుంచి విశేషమైన స్పందన రావడం నాకు ఆనందాన్ని కలిగించింది. మీరంతా ఏకాగ్రత తో పరీక్షలు రాసి అద్భుతమైన ఫలితాలు సాధించాలని కోరుతూ శుభాశీస్సులు.. " అల్ ది బెస్ట్ " అని అన్నారు హరీశ్.
ఒత్తిడి, భయానికి తావు లేకుండా..
ఇక రేపటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ (Tenth exams 2022) ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పలు సూచనలు చేశారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్స్ రాయాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడి, భయానికి తావు లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించి తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సబితారెడ్డి.
ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయం..
టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ (RTC) ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందిస్తోంది. బస్‌పాస్ వ్యాలిడిటీ అయిపోయినా కూడా ఆ బస్ పాస్ తో పాటు టెన్త్ హాల్‌టికెట్ చూపిస్తే పరీక్ష కేంద్రానికి, పరీక్ష కేంద్రం నుంచి రిటర్న్ జర్నీని కూడా ఉచితంగా పొందవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.
కోవిడ్ నేపథ్యంలో ఈ సారి పరీక్షా పేపర్లను 11 నుంచి 6కు కుదించించి విద్యాశాఖ. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
విద్యార్థులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. మాస్క్ ధరించాలని సూచించారు. ఇంకా ఎగ్జామ్ సెంటర్లకు వాటర్ బాటిల్, శానిటైజర్ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే.. పరీక్షా సమయానికి గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు హాజరుకావాలని అధికారులు సూచించారు. 9.35 గంటలు తర్వాత అంటే 5 నిమిషాలు దాటితే కేంద్రాల్లోకి అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Rao, Sabita indra reddy, Tenth class, TS 10th Exams 2022