ఆత్మీయంగా పలకరించి.. కడుపు నిండా అన్నం పెట్టి.. మంత్రి వేముల ఔదార్యం

వలస కార్మికులతో మాట్లాడుతున్న మంత్రి వేముల

తమ సొంతూళ్లకు పయనమైన వలస కార్మికులను మార్గమధ్యలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చూశారు. వారితో కాసేపు ముచ్చటించారు. వారి బాగోగులు.. కుటుంబాల పరిస్థితి అడిగితెలుసుకున్నారు.

  • Share this:
    వాళ్లంతా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలసొచ్చిన కార్మికులు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించడం వల్ల చేతికి పనిలేక.. చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడిపోతున్నారు. దీంతో తమ సొంతూళ్లకు పయనమైన వలస కార్మికులను మార్గమధ్యలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చూశారు. వారితో కాసేపు ముచ్చటించారు. వారి బాగోగులు.. కుటుంబాల పరిస్థితి అడిగితెలుసుకున్నారు. రహదారి వెంట చిన్న పిల్లలతో నడిచి వెళ్లడాన్ని చూసి చలించిపోయిన మంత్రి తన సొంత ఖర్చులతో కడుపు నిండా అన్నం పెట్టి మహారాష్ట్ర బార్డర్ వరకు పంపిస్తున్నారు. గత మూడు రోజులుగా వలస కార్మికులను ఇలాగే భోజనం పెట్టి పంపిస్తున్నారు. ఆదివారం నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గం శ్రీరాంపూర్ వద్ద ఏర్పాటు చేసిన రవాణ సౌకర్యం, భోజన సదుపాయాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వలస కార్మికులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆత్మీయంగా పలకరించి కాసేపు వారితో మాట్లాడారు. దీంతో వలస కార్మికులు మంత్రి తీరుపట్ల హర్షం వ్యక్తం చేశారు.
    Published by:Narsimha Badhini
    First published: