హోమ్ /వార్తలు /తెలంగాణ /

Harish Rao: ‘‘ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతోషిస్తారు”: ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్ ​రావు

Harish Rao: ‘‘ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతోషిస్తారు”: ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్ ​రావు

మున్సిపాలిటీలో వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

మున్సిపాలిటీలో వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

మున్సిపాలిటీలో వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

  దుబ్బాక మున్సిపాలిటీలో వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి (One Hundred Bed Government Regional Hospital)ని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు  ప్రారంభించారు. కార్యక్రమానికి  మంత్రితో పాటు  మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, యాదవ రెడ్డి, మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

  దుబ్బాక మీద చాలా ప్రేమ..

  రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (State Finance and Health Minister Harish Rao) మాట్లాడుతూ.. దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషిస్తారని అన్నారు.  ‘‘ దుబ్బాక లో వంద పడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం (Starting a hospital) సంతోషం. ఇది స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి కల. రామ లింగన్న కోరిక.. ముఖ్యమంత్రి కేసీఆర్ (Chief Minister KCR) ఇచ్చిన వరం దుబ్బాకలో వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి. ముఖ్యమంత్రి కేసీఆర్  కు దుబ్బాక మీద చాలా ప్రేమ. దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ (Chief Minister KCR) సంతోషిస్తారు. స్వర్గీయ మాజీమంత్రి ముత్యంరెడ్డి హయాంలో కానీ పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దుబ్బాకలో చేసుకుంటున్నాం.

  70 ఏండ్లు పరిపాలించిన గత ప్రభుత్వాల హయాంలో ఆసుపత్రులు కుంటుపడిన ఆసుపత్రులను, ఇయ్యాల టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి చేసుకుంటున్నాం. భారత దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్య రంగం (Telangana Medical Sector) ఉంది. 18 ఏండ్లు దాటిన వారు తప్పనిసరి కరోనా వ్యాక్సినేషన్ తీసుకోండి. ఒమిక్రాన్ వైరస్ కోసం గజగజ వణుకుతున్నారు.. అది పోవాలంటే మాస్క్ తప్పనిసరి. కేంద్రం నుంచి అనుమతి వస్తే మూడో డోస్ వేసుకుందాం. కరోనా వ్యాక్సిన్ పై అనుమానం, అపోహలు పెట్టుకోవద్దు’’. అన్నారు.


  TSMIDC ఛైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ (Errolla Srinivas) మాట్లాడుతూ.. ‘‘యశోద ఆసుపత్రి తరహా దుబ్బాక లో వంద పడకల ఆసుపత్రి నిర్మించడం సంతోషం. ప్రతి గ్రామంలో నాణ్యమైన వైద్యం అందడమే ముఖ్యమంత్రి కల. అందుకు అనుగుణంగా డాక్టర్ లు, వైద్య సిబ్బంది పనిచేయాలి”అని తెలిపారు.

  ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (MP Kotha Prabhakar Reddy) మాట్లాడుతూ.. ‘‘దుబ్బాక ప్రాంతం లో వందపడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషం. ఆసుపత్రికి తగినంత స్టాఫ్, పరికరాలు మంజూరు చేయాలని మంత్రి హరీష్ రావుకు వినతి” అని అన్నారు.

  సిద్దిపేట తరహా దుబ్బాకలో..

  దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (Dubaka MLA Raghunandan Rao) మాట్లాడుతూ.. ‘‘వంద పడకల ఆసుపత్రికి వైద్య సిబ్బంది కి క్వార్టర్ లు మంజూరు చేయాలని మంత్రి కి విజ్ఞప్తి. దుబ్బాకకు ఒక డయాలసిస్ మంజూరు చేయాలని విజ్ఞప్తి. సిద్దిపేట తరహా దుబ్బాక లో వైద్య విధాన పరిషత్ ను డెవలప్ చేయాలి. మిరుదొడ్డిలో యునాని ఆసుపత్రికి తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’’. అన్నారు.

  దుబ్బాకకు వరాల జల్లు ..

  బస్తీ దవాఖాన, మార్చురీ కై ఫ్రీజర్, రక్తనిధి నిల్వ కేంద్రం, డయాలసిస్ కేంద్రం, 10 పడకల ఐసీయూ, ఆసుపత్రి చుట్టూ కాంపౌండ్ వాల్, వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి కావాల్సిన వైద్య సిబ్బంది, దుబ్బాక మున్సిపల్ కు రెండు వైకుంఠ రథాలు, ఎస్ఎన్ సీయూ-నవజాత శిశువు కేంద్రం మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు.

  First published:

  Tags: Dubbaka, Harish Rao

  ఉత్తమ కథలు