తెలంగాణ పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమపై చేైసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాష్ట్రంలోని గంగపుత్రులు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గంగపుత్రుల హక్కులను హరించే విధంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలుచోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టారు. మంత్రి తలసాని తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మంత్రి తలసాని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని కొందరు గంగపుత్ర నేతలు హెచ్చరించారు.
అయితే తాజాగా ఈ వివాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పందించారు. ఇటీవల కోకాపేటలో జరిగిన ముదిరాజ్ శంకుస్థాపన కార్యక్రమంలో తాను గంగపుత్రలను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. తన వ్యాఖ్యల ఏమైనా తప్పుగా ఉన్నాయని భావిస్తే.. వారికి క్షమాపణ చెప్పేందుకు సిద్దంగా ఉన్నట్టు చెప్పారు.
— Talasani Srinivas Yadav (@YadavTalasani) January 17, 2021
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి గంగపుత్రుల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకున్న వారు లేరన్నారు. గతంలో మత్స్యకార సొసైటీలలో వివిధ వర్గాల వారు సభ్యులుగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ గంగ పుత్రులకు చెరువులు, కుంటలు మీద సర్వాధికారాలు ఇవ్వాలని అసెంబ్లీ వేదికగా చెప్పిన అంశాలను మాత్రమే తాను ప్రస్తావించానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్నివర్గాల అభివృద్ది కోసం కృషి చేస్తున్నారని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Talasani Srinivas Yadav, Telangana