దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఇది కేసీఆర్ ఉగ్రరూపం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్కౌంటర్ దేశానికే మార్గదర్శకమని తలసాని అన్నారు. నిర్భయ నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారని తెలిపారు. కేసీఆర్ మౌనాన్ని చాలామంది తక్కువగా అంచనా వేశారని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని... కేసీఆర్ని జాతీయ నేతలు సైతం ప్రశంసిస్తున్నారని తలసాని వ్యాఖ్యానించారు. దిశ హత్య కేసులో సీన్ రీ కన్స్ట్రక్షన్ సందర్భంగా నిందితులు పోలీసులపై దాడికి దిగడంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్ నలుగురు నిందితులు హతమయ్యారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.