Home /News /telangana /

TS politics : రాష్ట్రంలో మాకంటే బలవంతుడు ఎవడైనా ఉంటడా...? ఒళ్లు దగ్గరపెట్టుకొండి..! రేవంత్ రెడ్డికి కౌంటర్..!

TS politics : రాష్ట్రంలో మాకంటే బలవంతుడు ఎవడైనా ఉంటడా...? ఒళ్లు దగ్గరపెట్టుకొండి..! రేవంత్ రెడ్డికి కౌంటర్..!

తలసాని శ్రీనివాస్ యాదవ్(ఫైల్ ఫోటో)

తలసాని శ్రీనివాస్ యాదవ్(ఫైల్ ఫోటో)

TS politics : ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి కేసిఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస యాదవ్ ఘాటుగా స్పందించారు. తాము సీఎం ఆదేశాలతో సైలంట్‌గా ఉంటున్నామని లేదంటే రాష్ట్రంలో మాకంటే బలవంతుడు ఎవడైనా ఉన్నాడా అంటూ ఆయన ప్రశ్నించారు..

ఇంకా చదవండి ...
    ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సభలో ఆపార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస యాదవ్ ఘాటుగా స్పందించారు..జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి సీఎం కేసిఆర్ ను జైలుకు వెళతారని అనడం విడ్దూరంగా ఉందని అన్నారు.

    ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే భాష వల్ల రాజకీయాలు చులకనగా మారాయని అన్నారు. జైలుకు పోయిన నేతలే జైలు గురించి మాట్లాడడం విడ్దూరంగా ఉందని దుయ్యబట్టారు. ఇక ముఖ్యమంత్రినే ఏకవచనంతో మాట్లాడడం ద్వార వారి రాజకీయ పరిపక్వతకు అద్దం పడుతుందని అన్నారు..హైదరాబాద్ ‌లో పుట్టిన మేము అనుకుంటే అంతకంటే ఎక్కువ మాట్లాడగలమని అన్నారు.. రాజకీయాల్లో మాకంటే బలవంతుడు ఎవడు ఉండరని హెచ్చరించారు....మాట్లాడితే మీడియాలో వస్తుందని ఏదిపడతే అదిమాట్లాడితే మంచిది కాదని హితవు పలికారు..ఇక నుండి సీఎం కేసిఆర్‌ను విమర్శించేటప్పుడు ఒళ్లు దగ్గరబెట్టుకుని మాట్లాడని ఆయన హెచ్చరించారు. తాము ముఖ్యమంత్రి ఆదేశాలతో నోరు జారడం లేదని ..అన్నారు. సీఎం కేసిఆర్ ఆదేశంలో సైలంట్‌గా ఉంటున్నమని అంతేగాని ఒకవేళ తాము నోరు విప్పితే... మాకంటే బలవంతుడు రాష్ట్రంలో ఉంటడా...అని ప్రశ్నించారు..ఇక పార్టీ సమావేశాలకు జనం ఎప్పుడైన వస్తారని.. .. చిన్నచిన్న పార్టీలు పెట్టిన ప్రజలు వస్తారని దాన్ని చూసి బలం అనుకుంటే పొరపాటని హితవు పలికారు.

    కాగా ఓరేయ్ సన్నాసి నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం అంటూ తీవ్ర పదజాలంతో రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. మరో ఇరవైనెలల తర్వాత సీఎం చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఈ నేపథ్యంలోనే దళితుతోపాటు గిరిజన కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Revanth reddy, Talasani Srinivas Yadav, TRS leaders

    తదుపరి వార్తలు