Telangana: సీడ్ బాల్స్‌లో రికార్డ్.. గిన్నిస్ బుక్‌లో చోటు.. మంత్రిని అభినందించిన సీఎం కేసీఆర్

కేసీఆర్, శ్రీనివాస్ గౌడ్, సంతోష్ కుమార్

Telangana: తెలంగాణకు హరితహారం స్పూర్తితో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, సీడ్ బాల్స్‌ను రికార్డు స్థాయిలో తయారు చేసింది.

  • Share this:
    సమైక్య పాలనలో వలసలకు ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయం పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న సాగునీటి జలాలతో నేడు ఎటు చూసినా పచ్చని పంటలతో కనువిందు చేస్తున్నదని అన్నారు. బీడు భూములు రాల్లు గుట్టలకే ఇన్నాల్లూ పరిమితమై వున్న పాలమూరు పచ్చదనంతో తన రూపు రేఖలను మార్చుకుని, వినూత్న రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుండడం సంతోషకరమన్నారు. తెలంగాణకు హరితహారం స్పూర్తితో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, సీడ్ బాల్స్‌ను రికార్డు స్థాయిలో తయారు చేసింది.

    వీటిని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వెదజల్లడం, సీడ్ బాల్స్ తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు జ్జాపికను శుక్రవారం ప్రగతిభవన్‌లో సిఎం కేసీఆర్ చేతులమీదుగా ఎంపీ జోగినపెల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని సీఎం కేసీఆర్ అభినందించారు.

    తక్కువ ఖర్చుతో ఎక్కువ పచ్చదనాన్ని సాధించే దిశగా రికార్డు స్థాయిలో, 10 రోజుల్లో 2 కోట్ల పది లక్షల సీడ్ బాల్స్‌ను ఒక నెల కాలంలో తయారు చేసి కొండలు గుట్టల ప్రాంతాల్లో వెదజల్లడం ద్వారా పచ్చదనం అభివృద్ధికి పాటుపడుతున్న పాలమూరు జిల్లా మహిళా సంఘాల కృషిని సీఎం కేసీఆర్ అభినందించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: