Hyderabad : మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుండి ప్రాణహాని ...హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన మహిళ...!

Hyderabad : మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుండి ప్రాణహాని ...

Hyderabad : మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ.. రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో మహాబుబ్‌నగర్ జిల్లా చెందిన వారు ఫిర్యాదు చేశారు. ఓ కేసులో స్థానిక పోలీసుల చేత తమను అర్థరాత్రి పూట బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Share this:
    మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన బాధితులు విశ్వనాధ రావు, పుష్పలత అనే దంపతులు నేడు హైదరాబాద్ లోని మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. 2018 ఎన్నికలకు సంబంధించి ఆ దంపతులు సాక్ష్యులుగా ఉన్నామని, ఆ విషయంలో తమను సాక్ష్యం చెప్పకుండా వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇందుకోసం తమను ఆర్థికంగా,మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు మీడియాకు వివరించారు.ఈ క్రమంలోనే స్థానిక సీఐ చేత తమను బెదిరించారని చెప్పారు. అర్థరాత్రి స్థానిక సీఐ మహెశ్వర్ ఇంటికి వచ్చి పోలీసు స్టేషన్‌కు రావాలని అడిగారని ,దీంతో తమకు తెలిసిన డీఎస్పీ ద్వారా ఫోన్ చేయించుకుని తాము బయటపడ్డామని అన్నారు. ఆ కేసు విషయంలో తమకు మంత్రితో పాటు ఆయన సోదరుడి నుండి ప్రాణహాని ఉందని ఆరోపించారు. తమకు వారి నుండి రక్షణ కల్పించాలని కోరారు.

    ఇక ఇదేవిధంగా తమను వేధిస్తే..మంత్రితోపాటు ఆయన సోదరుడి పేర్లు రాసి పోలీసు స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటానమని చెప్పారు.ఇక స్థానిక పోలీసులు తమతోపాటు తమ పిల్లలను కూడా భయబ్రాంతులకు గురి చేస్తూ..దుర్భాషలాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక నూతనంగా నిర్మిస్తున్న ఇంటిని కూడా అడ్డుకోవడంతోపాటు తమ ప్రైవేటు ఉద్యోగాలను కూడా తీసివేయించారని చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published: