పండ్ల ప్యాకింగ్ కేంద్రాన్ని సందర్శించిన..మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఇంటి వద్దకే పండ్ల కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని మంత్రి అన్నారు.

ఇంటి వద్దకే పండ్ల కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని మంత్రి అన్నారు.

  • Share this:
    రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మూసాపేటలో వాక్ ఫర్ వాటర్ పండ్ల ప్యాకింగ్ కేంద్రాన్ని సందర్శించారు.
    ఇంటి వద్దకే పండ్ల కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని మంత్రి అన్నారు. అతి తక్కువ సమయంలో 28 లక్షల హిట్లను తాకిన మిస్డ్ కాల్ సెంటర్. జంటనగరాలలో ఇప్పటివరకు 71 వేల కుటుంబాలకు రైతులనుండి 11 వందల 25 టన్నుల పండ్ల సరఫరా జరిగింది. మరిన్ని నాణ్యమైన సేవల కోసం తపాలశాఖతో ఒప్పందం కుదుర్చుకొన్నారు. వాక్‌ ఫర్ వాటర్‌ ని తెలంగాణ మార్కెటింగ్‌శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ 5 కిలోల బత్తాయి, మామిడి పండ్లు తీసుకుంటే ఉత్పత్తిలో 50 శాతం ఇక్కడే వినియోగమవుతుంది. 300 కు ఆరురకాల పండ్ల కాంబో ప్యాక్ తో పాటు రూ.300 కు 5 కిలోల పండ్లు, సేంద్రీయ, ప్రత్యేక రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.. కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలకు ఇంటి వద్దకే పండ్లను అందించే ప్రయోగం బాగుంది అన్నారు.
    Published by:Venu Gopal
    First published: