జాతరలో గాజులు వేసుకున్న తెలంగాణ మంత్రి .. పీక ఊదుతూ సందడి

తెలంగాణ అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకున్నట్లు మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్‌, కురవి వీరభద్రస్వామివారి ఆశీస్సులతోనే తనకు మంత్రి పదవి వచ్చిందని తెలిపారు.

news18-telugu
Updated: February 21, 2020, 3:47 PM IST
జాతరలో గాజులు వేసుకున్న తెలంగాణ మంత్రి .. పీక ఊదుతూ సందడి
జాతరలో పీక ఊదుతున్న సత్యవతి రాథోడ్
  • Share this:
మహా శివరాత్రి పర్వదినాన్ని యావత్ దేశం భక్తిశ్రద్ధలతో జరుపుకుంటోంది. భక్తుల పూజలతో శైవక్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక శివరాత్రి వేళ తెలంగాణ గిరిజనశాఖమంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్‌ జిల్లా కురవి వీరభద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో జాతర నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన సత్యవతి రాథోడ్.. ఓ దుకాణానికి వెళ్లి గాజులు వేయించుకున్నారు. అనంతరం పీక కొని ఊదుతూ జాతరలతో సందడి చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తెలంగాణ అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకున్నట్లు మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్‌, కురవి వీరభద్రస్వామివారి ఆశీస్సులతోనే తనకు మంత్రి పదవి వచ్చిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ స్వామికి కోర మీసాలు సమర్పిస్తానని మొక్కుకున్నారని... అన్నట్లుగానే సీఎం అయ్యాక ఆయన స్వయంగా వచ్చి మీసాలు సమర్పించారన్నారని గుర్తుచేశారు. కురవి ఆలయ అభివృద్ధికి సీఎం రూ.5 కోట్లు ఇచ్చారని, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు సత్యవతి. ఈ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జాతరలో పర్యావరణ హితమైన బ్యాగులను పంపిణీ చేశారు.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు