YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (Ys Sharmila) ఏపీ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ తెలంగాణ పాలిటిక్స్ పై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రజా ప్రస్థానం పేరుతో 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేపట్టారు. నిన్న పాలేరులో YSRTP పార్టీ తొలి కార్యాలయ నిర్మాణానికి షర్మిల (Ys Sharmila) భూమి పూజ చేశారు. ఇక పాలేరు నుండి షర్మిల పోటీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇదిలా ఉంచితే YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (Ys Sharmila) నేడు తన బర్త్ డేని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో YSRTP నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా షర్మిల (Ys Sharmila)కు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ పర్యాటక శాఖా మంత్రి, వైసిపి నాయకురాలు రోజా షర్మిల (Ys Sharmila)కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఈ మేరకు ట్విట్టర్ లో మంత్రి రోజా (Minister Roja) ఓ పోస్ట్ పెట్టారు. మీ పుట్టిన రోజు సూర్యకాంతి, ఇంద్రధనస్సులు, ప్రేమ నవ్వులతో నిండి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మీ ప్రత్యేకమైన రోజున మీకు శుభాకాంక్షలు పంపుతున్నాను. జన్మదిన శుభాకాంక్షలు షర్మిల (Ys Sharmila) గారు అంటూ రోజా ట్విట్టర్ లో పోస్ట్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ ట్వీట్ లో గతంలో షర్మిల (Ys Sharmila)తో దిగిన ఫోటోను రోజా (Minister Roja) షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
I hope your birthday is full of sunshine ????, ????rainbows , ????love, and ☺laughter! Sending many good wishes to you on your special day ????. Happy Birthday dear @realyssharmila garu ???????????? pic.twitter.com/AwtjasbzUr
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 17, 2022
కాగా రోజా ట్వీట్ తో చాలా మంది అభిమానులు షర్మిలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ రాజన్న ఆశయాలతో షర్మిల ముందుకు వెళ్తున్నారని ట్వీట్ చేస్తున్నారు. ఇక ఆయా నియోజకవర్గాల్లో కూడా YSRTP కార్యకర్తలు కేక్ కట్ చేసి షర్మిల (Ys Sharmila) పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Birthday, Minister Roja, Telangana, YS Sharmila, Ysrtp