ఐదు రకాల ఆయుర్వేద మందులతో తయారు చేసిన ఆయుర్వేద రక్ష కిట్స్‌ను రెడ్ జోన్లో పనిచేస్తున్న పోలీసులు, వైద్య, మున్సిపల్ సిబ్బందికి అందజేయనున్నారు. అతి ప్రాచీనమైన ఆయుర్వేద వైద్య శాస్త్ర పరంగా కరోనాను ఎదుర్కొనేందుకు ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి ఆధ్వర్యంలో ఈ ఆయుర్వేద కిట్స్‌ను తయారు చేశారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుర్వేద రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం ప్రారంభించారు. బీఆర్కే భవన్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయుర్వేద కిట్స్‌ను పోలీసులు అధికారులకు అందించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారతదేశం కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపారు. తెలంగాణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తితో పాటు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు.
ఆయుర్వేద రక్ష కిట్లను తయారు చేసిన వారిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఆయుష్ అదనపు డైరెక్టర్ అనసూయ, ప్రిన్సిపల్ సూర్యప్రకాశ్, సూపరింటెండెంట్ పరమేశ్వరి, డ్రగ్ టెస్టింగ్ ల్యాబోరేటరీ డైరెక్టర్ శ్రీనివాసచారి, హైదరాబాద్ సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్, బాలనాగాదేవి ఉన్నారు. విశ్వ ఆయుర్వేద పరిషత్ తరపున 2వేల యూనిట్ల 250 గ్రాముల చవన్ ప్రాష్‌ను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eetala rajender, Telangana