Elections ; సైకిలెక్కిన పువ్వాడ అజయ్..కలెక్టర్, కమిషనర్లతో నగర పర్యటన..

minister cycle ride

Election campaign సైకిలెక్కిన పువ్వాడ అజయ్..కలెక్టర్, కమీషనర్లతో నగర పర్యటన.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల క్లియరెన్స్ కు కసరత్తు.. అభివృద్ది చేశాము అశ్వీర్వదించాలని అప్పుడే ప్రచారం.

  • Share this:
    ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావు అధికారింగా సైకిల్ దిగితే... అదే జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం సైకిల్ పై షికార్లు కొట్టారు. ఖమ్మం మున్సిపాలిటికి త్వరలో ఎన్నికల నగారా మ్రోగనుండడంతో ఖమ్మం నగర అభివృద్దిపై దృష్టి సారించారు. నగరంలో జరుగుతున్నపనులను పర్యేవేక్షించేందుకు కలెక్టర్ కర్ణన్ మున్సిపల్ కమీషనర్ అనురాగ్ కలిసి
    నగరంలో కలియ తిరిగారు. మున్సిపాలిటి నుండి వైరా రోడ్డు మీదుగా పలు ప్రధాన కూడళ్ల గుండా సైకిల్ పై చక్కర్లు కొట్టారు.

    తెలంగాణలో మున్సిపాలిటిలకు మరికోద్ది రోజుల్లో ఎన్నికలకు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు ఓటర్ల జాబితా తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. దీంతో అనతి కాలంలోనే మున్సపాలిటీల ఎన్నికలు నిర్వహిస్తామని సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ తోపాటు సిద్దిపేట, నకేరేకల్, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు సాధారణ ఎన్నికలు, నిర్వహించనున్నారు.దీంతో ఆయా నగర మున్సిపాలిటీలను స్వంతం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇటివల ఎమ్మెల్సి ఎన్నికల విజయంతో అటు నాగార్జున సాగర్ మరియు స్థానిక సంస్థలను కూడ కైవసం చేసుకునేందుకు పావులు కదిపారు. దీంతో ఎన్నికల్లో పట్టు సాధించేందుకు స్థానిక నేతలు ఫీట్లు చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలోనే మంత్రి పువ్వాడ అజయ్ నేడు ఖమ్మం నగరంలో పర్యటించారు. పెండింగ్ పనులను పర్యవేక్షించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. మరోవైపు నగర అభివృద్దికి ప్రస్తుత బడ్జెట్ లో మొత్తం 150 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. కాగా ఎస్డీఎఫ్ నిధుల ద్వార రోడ్లు, డ్రైనేజీ పనులను నిర్వహిస్తున్నట్టు వివరించారు. నగర అభివృద్దితో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని , మరిన్ని సేవలను అందించేందుకు ప్రభుత్వాన్ని ఆశ్వీర్వదించాలని కోరారు. మంత్రి వెంట పలువురు నేతలు అధికారులు ఉన్నారు.
    Published by:yveerash yveerash
    First published: