Chiranjeevi - Puvvada Ajay Kumar: ఆచార్య సెట్‌లో తెలంగాణ మంత్రి పువ్వాడ.. చిరంజీవితో ముచ్చట్లు.. ఆ ఫొటోలపై కొత్త చర్చ

ఆచార్య సెట్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆచార్య సినిమా సెట్‌లో సందడి చేశారు.

  • Share this:
    తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆచార్య సినిమా సెట్‌లో సందడి చేశారు. హైదరాబాద్ శివారులోని కోకా పేటలో వేసిన భారీ సెట్‌లో జరగుతున్న ఆచార్య చిత్ర షూటింగ్ స్పాట్‌కు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెళ్లారు. అక్కడ చిత్ర హీరో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివతో మంత్రి మాట్లాడారు. చిరంజీవికి, చిత్ర బృందానికి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు కొరటాల శివ మంత్రికి వివరించారు. ఇందుకు సంబంధించిన విశేషాలను మంత్రి ట్విటర్ వేదికగా వెల్లడించారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఆ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక, మంత్రి షేర్ చేసి ఫొటోల్లో వెనకాల కనిపిస్తున్న చిత్ర పటాలు..  సినిమా కథమేటనేదానిపై కొత్త చర్చకు దారితీశాయి.

    మరోవైపు సైరా తర్వాత చిరంజీవి చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక, నిన్న విడుదలైన ఆచార్య సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ టీజర్‌లో రామ్ చరణ్ వాయిస్ ఉంది కానీ విజువల్ కనిపించలేదు. ఇక, పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా ఆచార్య అని ఎందుకు అంటారు.. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో..? అంటూ చిరు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. 1 నిమిషం 7 సెకన్లు ఉన్న టీజర్‌కు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనిపించింది. మరోవైపు టీజర్‌లో హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను కూడా చూపించలేదు దర్శక నిర్మాతలు.

    Chiranjeevi - Puvvada Ajay Kumar, Puvvada Ajay Kumar Meets Chiranjeevi, Chiranjeevi, Puvvada Ajay Kumar, Puvvada Ajay Kumar In Acharya Movie sets, Acharya Movie sets, చిరంజీవి, పువ్వాడ అజయ్ కుమార్, ఆచార్య మూవీ సెట్‌లో మంత్రి పువ్వాడ, చిరంజీవిని కలిసిన పువ్వాడ అజయ్ కుమార్
    చిరంజీవితో మంత్రి పువ్వాడ(Image-Twitter)



    ఇక, ఈ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మే 13న ఈ చిత్రం విడుదల కానున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. సైరా సినిమా యావరేజ్ దగ్గరే ఆగిపొవడంతో ఆచార్యతో బ్లాక్‌బస్టర్ కొట్టాలని చిరంజీవి అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: