MINISTER PRASHANTH REDDY MADE SERIOUS COMMENTS ON RYTHU BHANDU VRY NZB
TS NEWS :రైతు బంధుపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఉద్యోగుల జీతాలు ఆపినా .. పర్వాలేదు..కాని ?
రైతు బంధు ఉత్సవాల్లో మంత్రి
TS NEWS : మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు అమలు కోసం అవసరమైతే ఉద్యోగులకు జీతాలు ఆపి ముందుగా రైతు బంధు పెట్టుబడి ఇవ్వాలని సీఎం కేసిఆర్ చెప్పారని అన్నారు.
రైతు బంధు సాయం పెట్టుబడి 50వేల కోట్ల రూపాయలకు చేరుకున్న నేపథ్యంలో తెలంగాణలో గడిచిన కొద్ది రోజుల్లో ఉత్సవాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులు తమ పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంతో పాటు పెద్ద పెద్ద చిత్రాలను తమ పంట పోలాలతో పాటు వ్యవసాయ దినుసులు, కూరగాయలతో సంబరాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి ప్రశాంత్ రెడ్డి రైతు బంధు నిధులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని వివరించారు. రైతు బంధు నిధుల కోసం సీఎ కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారని , దేశంలో ఎక్కడా లేని ఈ పథకం నిధులను సమకూర్చేందుకు ప్రయత్నించారని అన్నారు. ఈ క్రమంలో అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆపిన పర్వాలేదు కాని ముందుగా రైతులకు వారి ఖాతాల్లో రైతు బంధు ఇవ్వాలని చెప్పారని అన్నారు. మరోవైపు ఇలాంటీ పథకం దేశంలో ఎక్కడ అమలవుతున్నట్టు బీజేపీ నేతలు నిరూపించినా.. తాను రాజీనామా చేయడానికి కూడా సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు.
కాగా నేడు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో రైతు బంధు ఉత్సవాలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి హజరయ్యారు.. రైతులు ఎండ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు.. పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ కూడా రైతులు పెట్టుబడి సహయం అందించడం లేదు.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాత్రమే అందిస్తున్నారన్నారు.. రైతు బంధు ఎన్నికల తరువాత ఇవ్వరని ప్రతిపక్షాలు విమర్శించాయి.. కానీ సీఎం కేసీఆర్ పంటకు ఐదు వేల చోప్పున రెండు పంటలకు యేడాదికి ఎకరాకు 10వేల రూపాలయాలు రైతుల ఖతాల్లో జమ చేస్తున్నామన్నారు..
ఇక తెలంగాణ లో రైతు బంధు ను చూసి కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా రైతులకు సహయం అందిస్తుందని అన్నారు.. అవసరం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నిలిపివేసి.. రైతులకు పెట్టుబడి సహయం అందించాలని సీఎం కేసీఆర్ చేప్పారని మంత్రి అన్నారు..
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.