హోమ్ /వార్తలు /తెలంగాణ /

Malla Reddy: క్యాసినో నిర్వాహకుడి కారుకు మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్.. మంత్రి ఏమన్నారంటే..

Malla Reddy: క్యాసినో నిర్వాహకుడి కారుకు మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్.. మంత్రి ఏమన్నారంటే..

మల్లారెడ్డి (ఫైల్ ఫొటో)

మల్లారెడ్డి (ఫైల్ ఫొటో)

Malla Reddy: క్యాసినో నిర్వాహకులతో మల్లారెడ్డికి సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై మల్లారెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే స్టికర్‌ వ్యాలిడిటీ ముగియడంతో తాను మూడు నెలల క్రితమే పడేశానని.. ఎవరో దానిని తీసుకొని వాడితే.. తనకేం సంబంధమని ఆయన అన్నారు.

ఇంకా చదవండి ...

  ప్రస్తుత తెలంగాణలో క్యాసినో వ్యవహారం (Casino Case) హాట్ టాపిక్‌గా ామారింది. క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు సోదాలు  నిర్వహించి.. పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో మాధవ రెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి (Minister Malla reddy) ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉంది. ఆ కారుపై ఎమ్మెల్యే ... మల్లారెడ్డి... మేడ్చల్ నియోజకవర్గం  అని రాసి ఉంది. దాని వ్యాలిడిటీ కూడా మార్చి 2022 వరకే ఉంది. అంటే వ్యాలిడిటీ ముగిసి..ఇప్పటికే నాలుగు నెలలవుతుంది. అలాంటి స్టిక్కర్ మాధవ రెడ్డి కారుపై ఉండడం దుమారం రేపింది. క్యాసినో నిర్వాహకులతో మల్లారెడ్డికి సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై మల్లారెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే స్టికర్‌ వ్యాలిడిటీ ముగియడంతో తాను మూడు నెలల క్రితమే పడేశానని.. ఎవరో దానిని తీసుకొని వాడితే.. తనకేం సంబంధమని ఆయన అన్నారు.


  వాస్తవానికి మార్చిలో ఎమ్మెల్యే స్టిక్కర్ల అంశంపై తీవ్ర దుమారం రేగింది. మార్చి 17న జూబ్లిహిల్స్ రోడ్డు నెం.45లో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు రోడ్డుపై వెళ్తున్న పాదచారులను ఢీకొట్టడంతో.. ఓ చిన్నారి మృతి చెందింది. రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉంది. ఆ కారు తన కజిన్‌దని.. అప్పుడప్పుడూ తాను కూడా వాడతానని అప్పట్లో షకీల్ చెప్పారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేల స్టిక్కర్ల దుర్వినియోగంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. ఇలాంటి స్టిక్కర్స్ ఉన్న వాహనాలపై చర్యలు తీసుకున్నారు. మరి ఆ డ్రైవ్‌లో క్యాసినో నిర్వాహకుడు మాధవ్ రావు కారు దొరకలేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మల్లారెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ అతడి వద్దకు ఎలా వెళ్లింది? ఎప్పటి నుంచి వాడుతున్నాడన్న వివరాలు తెలియాల్సి ఉంది.

  కాగా, క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్ , మాధవ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్ హౌస్‌లో ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం మొత్తం 8 చోట్ల సోదాలు చేసి.. కీలక ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలోనే వీరికి సినీ హీరోయిన్లు, రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. చికోటి ప్రవీణ్‌తో సంబంధమున్న వారిలో తెలంగాణ మంత్రి, ఏపీ మాజీ మంత్రితో పాటు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది సెలబ్రిటీలతోనూ ప్రవీణ్‌కు పరిచయాలు ఉన్నాయి. సోదాల అనంతరం.. చికోటి ప్రవీణ్‌తో పాటు మాధవ రెడ్డికి విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గోవాతో పాటు నేపాల్‌లో క్యాసినో ఇల్లీగల్ కాదని.. తానేం తప్పు చేయలేదని చికోటి ప్రవీణ్ చేశారు. ఐతే డబ్బులను హవాలా మార్గాల్లో తరలిస్తున్నారన దానిపైనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Malla Reddy, Telangana

  ఉత్తమ కథలు