• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • MINISTER MAHMOOD ALI COMMENTS ON HYDERABAD NIGHT CURFEW SPECULATION SU

Hyderabad: హైదరాబాద్‌లో నైట్ కర్ఫ్యూ?.. క్లారిటీ ఇచ్చిన హోం మంత్రి మహమూద్ అలీ.. ఆయన ఎమన్నారంటే..

Hyderabad: హైదరాబాద్‌లో నైట్ కర్ఫ్యూ?.. క్లారిటీ ఇచ్చిన హోం మంత్రి మహమూద్ అలీ.. ఆయన ఎమన్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నైట్ కర్ఫ్యూ విధించనున్నారని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టత ఇచ్చారు.

 • Share this:
  దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో, ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ‌లను అమలు చేస్తున్నాయి. ఇక, తెలంగాణలో కూడా కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్లలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైనా మహారాష్ట్రలో కరోనా తీవ్రత భారీగా ఉండటంతో.. ఇక్కడి ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా పరిస్థితుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. అయితే తెలంగాణలో క్రమంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శని, ఆది వారాల్లో హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొనున్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.. వారంలో 2 రోజులు లాక్‌డౌన్ లేదా రాత్రి పూట కర్ఫ్యూ విధించాలనే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.

  అయితే హైదరాబాద్‌లో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఓల్డ్ సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో కేసులు పెరతున్నాయని.. అయితే వీకెండ్‌లలో లాక్‌డౌన్‌లు, హైదరాబాద్‌లో రాత్రి పూట కర్ఫ్యూలు విధించే ప్రణాళికలు ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేవన్నారు. లాక్‌డౌన్ అనేది చాలా మంది జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనవసర సమావేశాలకు నిర్వహించకుండా ఉంటే మంచిందని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని అన్నారు. అయితే స్కూల్స్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వాటి నిర్వహణపై ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

  ఇక, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 337 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1671కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,958 ఉండగా.. వీరిలో 1,226 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 91 కేసులు ఉన్నాయి.
  Published by:Sumanth Kanukula
  First published: