MINISTER KTR WROTE A LETTER TO CENTRAL GOVT TO REOPEN CCI AT ADILABAD VRY
ktr letter : ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ కోసం కేటీఆర్ లేఖ
ktr letter : అదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ.. మంత్రి కేటీఆర్
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకి లేఖ రాశారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ktr letter : అదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ.. మంత్రి కేటీఆర్ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకి లేఖ రాశారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది.. ఈనేపథ్యంలోనే కేం ప్రభత్వ ఆధీనంలో ఉన్న పలు కంపనీల పునరుద్దరణకు ఒత్తిడిపెంచుతుంది..ఈ క్రమంలోనే మరోసారి అదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ను పునరుద్ధరించాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. అందుకు సంబంధించి లేఖ రాశారు..
లేఖలో పలు అంశాలు ఆయన ప్రస్తావించారు. 1984లో ఆదిలాబాద్ పట్టణంలో సుమారు 47 కోట్ల వ్యయంతో సీసీఐ ని ఏర్పాటు చేయడం జరిగిందని, సి సి ఐ కి 772 ఎకరాల్లో ప్లాంట్ ఉన్నదని, దీంతోపాటు 170 ఎకరాల్లో సిసిఐ టౌన్షిప్ కూడా ఉన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా మరట్వాడ, విదర్భ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల సిమెంట్ అవసరాలు తీరేవని, దురదృష్టవశాత్తు 1996లో నిధుల లేమితో కార్యకలాపాలు ఆగాయని, 2008లో సిసిఐ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించి పూర్తిగా మూసి వేయడం జరిగిందని అన్నారు. అయితే ఈ మూసివేతకు సంబంధించి ఉద్యోగులు కోర్టుకు వెళ్లారని, అప్పటి నుంచి ఈ అంశం పైన స్టేటస్ కో ఉందని, ఇప్పటికీ సుమారు 75 మంది ఉద్యోగులు కంపెనీ ఉద్యోగుల జాబితాలో ఉన్నారని తెలిపారు.
సీసీఐ కి ప్రత్యేకంగా 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ డిపాజిట్ల మైనింగ్ లీజు ఉందని.. ఇప్పటికీ 32 కెవిఏ విద్యుత్ సరఫరా కనెక్షన్ మరియు అవసరమైన నీటి లభ్యత ప్లాంట్ కి నేటికి ఉందని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. కంపెనీ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి అవసరమైన బొగ్గు సరఫరాను స్థానిక సింగరేణి కార్పొరేషన్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా తన లేఖలో ప్రస్తావించారు. ఇలా సిసిఐ ప్లాంట్ పునరుద్ధరణకు అనేక సానుకూల అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ దిశగా తగిన చర్యలను వెంటనే చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.