• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • MINISTER KTR WHO ISSUED EMPLOYMENT LETTERS TO 93 PEOPLE IN JALAMANDALI AT HYDERABAD VB

జలమండలి మేనేజర్లకు నియామక పత్రాల అందజేత.. ఇప్పటి వరకు లక్ష 33 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ: కేటీఆర్

జలమండలి మేనేజర్లకు నియామక పత్రాల అందజేత.. ఇప్పటి వరకు లక్ష 33 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ: కేటీఆర్

నియామక పత్రాలు అందజేస్తున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి రాష్ట్ర మున్సిప‌ల్‌శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉద్యోగ‌ నియామక పత్రాలు అందజేశారు. విజయవంతంగా ఉద్యోగాలు సాధించి నియామక పత్రాలు పొందిన ప్రతి ఒక్కరికి ఈ మేరకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

  • Share this:
    హైదరాబాద్ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి రాష్ట్ర మున్సిప‌ల్‌శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉద్యోగ‌ నియామక పత్రాలు అందజేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విజయవంతంగా ఉద్యోగాలు సాధించి నియామక పత్రాలు పొందిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఉద్యోగాల కల్పన పైన ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటిదాకా సుమారు లక్ష 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన‌ట్లు తెలిపారు. ప్రైవేట్ రంగంలో అనేక పెట్టుబడులను ఆకర్షించి సుమారు 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను సృష్టించిన‌ట్లు వెల్ల‌డించామన్నారు.

    ప్రభుత్వ ఉద్యోగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉద్యోగాన్ని ప్రజల సేవల కోసం ఉపయోగించండన్నారు. ప్రజలకు సేవ అందించడమే పరమావధిగా పని చేయాలని సూచించారు. మీదైన మార్కు చూపించే విధంగా సేవా దృక్పధాన్ని విడనాడకుండా పని చేయాలని సూచించారు.

    మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్


    నియామక పత్రాలు అందుకున్న జలమండలి మేనేజర్లు


    తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నదన్నారు. ఏలాగైతే ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలిగారో అదేవిధంగా ఒక్క‌ రూపాయి తీసుకోకుండా అత్యంత నిజాయితీతో ప్రజా సేవకి పాటుపడాలన్నారు. ఈ ఉద్యోగాన్ని ఒక సవాలుగా తీసుకొని జల మండలిని మరింత అభివృద్ధి పథాన నిలిపే విధంగా వినూత్న ఆలోచనలతో పనిచేయాలని కేటీఆర్ సూచించారు.
    Published by:Veera Babu
    First published: