KTR: పదవులు పోతాయ్... వారికి కేటీఆర్ వార్నింగ్

కొత్త చట్టాలు కఠినంగా ఉంటాయని తెలిపిన కేటీఆర్... అధికారులు సక్రమంగా పనిచేయకపోతే పదవులు ఊడతాయి జాగ్రత్త అని హెచ్చరించారు.

news18-telugu
Updated: February 20, 2020, 6:32 PM IST
KTR: పదవులు పోతాయ్... వారికి కేటీఆర్ వార్నింగ్
కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
రూపాయి లంచం ఇవ్వకుండా సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకాక్షించారు. మున్సిపల్ చట్టం కఠినంగా అమలు చేస్తామని అన్నారు. ఈ విషయంలో సరిగ్గా వ్యవహరించకపోతే పదవులు పోతాయని ఆయన నేతలను హెచ్చరించారు. అటువంటి పరిస్థితి రాకుండా అధికారులు వారి వారి విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.పదవులు శాశ్వతం కాదని... ప్రజల హృదయాల్లో నిలవాలని కేటీఆర్ సూచించారు. చెత్తను సంపూర్ణంగా నిర్మూలించేందుకు అందరూ సహకరించాలనీ..ప్రతీ ఒక్కరూ ఇంకుడు కుంతలు నిర్మించుకునేలా స్థానిక నేతలు చొరవచూపాలని సూచించారు.

పారిశుద్ధ్యం..పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టామని అటువంటి రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణా మాత్రమేని అటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా అధికారులు..నేతలు కృష్టి చేయాలని..పని విషయంలో ఎవ్వరు అలసత్వం వహించినా సహించేది లేదని ఉద్యోగాలు తీసేయటానికి కూడా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు..నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. రాజన్న ఆలయానికి వస్తే మంత్రుల పదవులు పోతాయనే అపోహ ఉండేదని... ఆ అపోహను సీఎం కేసీఆర్ తొలిగించారని కేటీఆర్ గుర్తు చేశారు.






First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు