TRS vs BJP : బండి సంజయ్‌పై మంత్రి కేటిఆర్ సెటైర్.. ధరఖాస్తుల ఉద్యమం అంటూ ట్విట్టర్ వార్..!

కేటీఆర్ (ఫైల్)

TRS vs BJP : తెలంగాణలో బీజేపీ ,టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్దం ముదురుతోంది..ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు జోరందుకున్నాయి. ఉన్నత స్థాయిలో నేతలు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటిఆర్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ల ట్విట్టర్ వార్ కొనసాగుతోంది.

  • Share this:
    హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో మరోసారి టీఆర్ఎస్ ,బీజేపీ నేతల మధ్య వార్ కొనసాగుతోంది.. ఇందులో భాగంగానే బండి సంజయ్ కరీంనగర్‌లో సోమవారం ధరఖాస్తుల ఉద్యమం చేపట్టారు.మరోవైపు తాను చేపట్టబోయో పాదయాత్రలో ప్రజా సమస్యలపై ధరఖాస్తులను తీసుకుని వాటిని ప్రభుత్వానికి ఇస్తామని ప్రకటించారు. దీంతో రాజకీయ వాతవరణం వేడెక్కింది.

    ఈ క్రమంలోనే బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ నేరుగా స్పందించారు. బండి సంజయ్ ప్రకటించిన ధరఖాస్తుల ఉద్యమాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే ఇదే ధరఖాస్తులను స్వాగతిస్తూనే..మరో సెటైర్ వేశారు. దేశవ్యాప్తంగా ప్రతి పౌరునికి ప్రధాని మోదీ 15 లక్షల రూపాయలు ఇవ్వడాన్ని కూడా తాము స్వాగతిస్తున్నానని ,ఇందుకోసం తెలంగాణ ప్రజలు సైతం ధరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అర్హులైనవారికి వారి జన్‌ధన్ ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వస్తాయని ట్విట్టర్ ద్వార పేర్కొన్నారు.





    ముఖ్యంగా పార్టీ నేతలు ఎవరికి వారు తమ ప్రచారాన్ని చేసుకంటున్నా..ఇలా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడంతో మరోసారి రెండు పార్టీల మధ్య రాజకీయ పోరు తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే సాధారణంగా ఎన్నికల సంధర్భంలోనే టీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు చేసుకోవడం సాధారణంగా మారుతున్నా..అవి రానున్న రోజుల్లో మరింత తీవ్రం అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి..ఇందుకు అనుగుణంగానే ధరఖాస్తుల ఉద్యమం మొదలైందని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే ఎవరికి ఎన్ని ధరఖాస్తులు వస్తాయో అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు.
    Published by:yveerash yveerash
    First published: