KTR twitter Dispute : దుమారం రేపుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్.. వ్యాక్సిన్ ఫోటోలపై రచ్చ

కేటీఆర్ (ఫైల్)

KTR twitter Dispute : మంత్రి కేటీఆర్ కరోనా వ్యాక్సిన్ పై చేసిన ట్వీట్ వివాదస్పదంగా మారింది. రెండు రోజుల క్రితమే ఏపి ఎంపీ ట్వీట్ చేసిన ఫోటోలనే తిరిగి మంత్రి కేటీఆర్ పోస్ట్ చేయడంపై విపక్షలు భగ్గుమంటున్నాయి. ఇంతకి ఆ ట్విట్‌ చేసిన ఒరిజినల్ ఫోటోలు ఎవరికి అనేది తేలాల్సిన అంశంగా మారింది.

  • Share this:
    మంత్రి కేటిఆర్‌ను(ktr) ఇటివల ట్విట్టర్ పోస్టుల వివాదం చుట్టుముడుతోంది. ఆయన రాష్ట్రంలో జరగే పలు కార్యక్రమాలను ఆయన ట్విట్టర్ (twitter)ద్వారా పోస్టుల చేస్తుంటారు. ట్విట్టర్‌లో ఆక్టివ్‌నెస్ కోసం ముందుగానే పలు అంశాలను పంచుకుంటారు. అయితే ఇటివల ఆయన చేస్తున్న పోస్టులు వివాద స్పదమవుతున్నాయి. దీంతో ఇలాంటి పోస్టులు తెలిసి చేస్తున్నారా లేక లేక తెలియకుండానే చేస్తున్నారా అనే సందేహాలు వెలువడుతున్నాయి.

    తాజాగా నేడు ట్విట్టర్ ద్వారా రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్(vaccine drive ) అంశాలను వివరిస్తూ రెండు ఫోటోలతో కలిపి ట్వీట్ చేశాడు. డ్రైవ్‌లో భాగంగా హెల్త్ వర్కర్స్, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ పోలాలు వెళ్లి మరి వ్యాక్సిన్ వేయడాన్ని తెలియ జేస్తూ ఆయన పోస్టు చేశాడు.. అందులో ఒక ఫోటో సిరిసిల్లలో(siricilla) మరోకటి ఖమ్మం (khammam)జిల్లాగా పేర్కొన్నాడు.





    ఇదంతా బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే వచ్చింది కేటిఆర్ పోస్టు చేసిన రెండు ఫోటోలపై వివాదం రాజుకుంది... అదికూడ రెండు రోజుల క్రితమే ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇదే ఫోటోలతో విజయనగరంలో కరోనా వ్యాక్సిన్ అంటూ ఆయన పోస్ట్ చేశాడు. అవే ఫోటోలను పెట్టి మంత్రి కేటిఆర్ పోస్టు చేస్తూ అది సిరిసిల్లలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియగా ఆయన పోస్టు చేయడంతో ఆయన తప్పులో కాలు వేశాడు.


    ఇది చదవండి : పంటలకు గిట్టుబాటు ధర ఇస్తే.. రైతు బంధు, రైతు బీమాలు అవసరమే లేదు..


    కాగా ఇదే అంశంపై బీజేపీ ఎమ్మె్ల్యే రఘునందన్ రావు(Raghunandan rao) చురకలంటించాడు.. మంత్రి కేటీఆర్ గోబెల్స్‌ను మించి పోయాడని అన్నారు. ఆయన బతికి ఉంటే మంత్రి కేటీఆర్ ఆయన్ను మించి పోయోవాడని పేర్కొన్నారు. ఇంకా నయం అమెరికా లో చేసిన వ్యాక్సిన్ ఫోటోలు పెట్టి .. అక్కడ వ్యాక్సిన్ పంపిణి చేసిన ఘనత మాదే అని పెట్టలేదంటూ పెదవి విరిచాడు.
    Published by:yveerash yveerash
    First published: