వహ్వా! యాదాద్రి మహాద్భుతం.. వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్..

Yadadri : మహాద్భుతంగా తయారవుతోంది యాదాద్రి ఆలయం. ప్రజలకు ఆలయ నిర్మాణం.. దాని విశిష్టతను తెలియజేసేందుకు మంత్రి కేటీఆర్ ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

news18-telugu
Updated: December 10, 2019, 12:47 PM IST
వహ్వా! యాదాద్రి మహాద్భుతం.. వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్..
యాదాద్రి (ఫైల్)
  • Share this:
పురాతన ఆలయాలను తలపించే రూపం.. ఆగమ శాస్త్రాలకు అద్దం పట్టే కట్టడం.. 2,50,000 టన్నుల గ్రానైట్ వినియోగం.. ఫలితంగా గర్భ గుడి మొదలు ఆలయ ప్రాంగణమంతా రాయిమయమే.. శిల్పుల కళలన్నీ అక్కడే ఉన్నాయా అన్నట్లుండే సుందర దృశ్యాలు.. ఇలా యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దేశంలోనే తొలి, అతి పెద్ద రాయి కట్టడమున్న ఆలయంగా చరిత్రకెక్కేందుకు సిద్ధమవుతోంది. ఆలయంలోకి అడుగు పెడితే ప్రశాంతత ఇట్టే ఆవహించేలా చుట్టూ అద్భుతమైన కళాఖండాలు దర్శనమివ్వనున్నాయి. అంత అద్భుతంగా కాదు కాదు.. మహాద్భుతంగా తయారవుతోంది యాదాద్రి ఆలయం. అయితే.. ప్రజలకు ఆలయ నిర్మాణం.. దాని విశిష్టతను తెలియజేసేందుకు మంత్రి కేటీఆర్ ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అందులో ఆలయానికి సంబంధించిన విశేషాలు వహ్వా! అనిపించేలా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆధ్యాత్మికను పెంపొందించేలా ఉంది.

రోమాలు నిక్కపొడిచేలా, మనసులో భక్తి పారవశ్యం పెంపొందేలా ఉన్న ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కేటీఆర్.. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం ఇదీ.. అంటూ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేపట్టిన మహాకార్యం ఇది అంటూ పోస్ట్ చేశారు.


Published by: Shravan Kumar Bommakanti
First published: December 10, 2019, 12:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading