హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth Reddy Audio Clip: రేవంత్ రెడ్డి ఆడియోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. శశిథరూర్‌పై కామెంట్స్..

Revanth Reddy Audio Clip: రేవంత్ రెడ్డి ఆడియోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. శశిథరూర్‌పై కామెంట్స్..

కేటీఆర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కేటీఆర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: కేటీఆర్, శశిథరూర్ ఒకటే అని రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈ ఆడియోలో ఉంది. శశిథరూర్ లాంటి వాళ్లను పార్టీ నుంచి బహిష్కరించాలని రేవంత్ రెడ్డి కామెంట్ చేసినట్టుగా ఆడియోలో ఉంది.

తెలంగాణ మంత్రి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న ఆడియోను ట్వీట్ చేశారు. ఈ ఆడియోలో రేవంత్ రెడ్డి కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను విమర్శించినట్టుగా ఉంది. కేటీఆర్, శశిథరూర్ ఒకటే అని రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈ ఆడియోలో ఉంది. శశిథరూర్ లాంటి వాళ్లను పార్టీ నుంచి బహిష్కరించాలని రేవంత్ రెడ్డి కామెంట్ చేసినట్టుగా ఆడియోలో ఉంది. ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి ఈ రకంగా సమాధానం ఇచ్చినట్టు ఆడియోలో ఉంది. ఈ ఆడియోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. శశిథరూర్‌పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను ఓ రిపోర్టర్ తనకు పంపించారని పేర్కొన్నారు. ఒకవేళ ఈ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే.. ఇది ఓటుకు నోటు ఆడియోలోని రేవంత్ రెడ్డి వాయిస్‌తో మ్యాచ్ అవుతుందని కేటీఆర్ అన్నారు. ఈ ఆడియోపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

అంతకుముందు రేవంత్ రెడ్డికాంగ్రెస్ ఎంపీ శ‌శిథరూర్‌ను రేవంత్ గాడిద‌తో పోల్చిన న్యూస్ క్లిప్‌ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. థ‌ర్డ్ రేట్ క్రిమిన‌ల్‌కు పార్టీ సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే ఇలానే ఉంటుంద‌ని కేటీఆర్ విమర్శించారు. పీసీసీ చీప్ అని రేవంత్‌ను మంత్రి త‌న ట్వీట్‌లో విమ‌ర్శించారు. ఇటీవ‌ల ఐటీ స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్ శ‌శిథ‌రూర్ త‌న బృందంతో హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ పర్యటనపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే శశిథరూర్ పర్యటనను రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించగా మండిపడినట్టు ఓ జాతీయ మీడియా క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

అయితే దీనిపై ట్విట్ ద్వారా రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. పుట్టుకతోనే అబద్ధాలకోరు అయిన కేటీఆర్ శశిథరూర్, ఫేక్ న్యూస్ వెనుక దాక్కోలేడని అన్నారు. రాష్ట్రంలోని పరిణామాలు, తన కుటుంబంపై అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మరల్చేందుకే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

రేవంత్ రెడ్డి ఈ ట్విట్ చేసిన కొద్ది గంటల్లోనే కేటీఆర్.. ఆయన రిపోర్టర్‌తో మాట్లాడినట్టుగా ఉన్న ఆడియోను ట్వీట్ చేశారు. ఒకవేళ ఈ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే.. ఇది ఓటుకు నోటు ఆడియోలోని రేవంత్ రెడ్డి వాయిస్‌తో మ్యాచ్ అవుతుందని కేటీఆర్ అన్నారు. ఈ ఆడియోపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

First published:

Tags: KTR, Revanth Reddy, Shashi tharoor, Telangana

ఉత్తమ కథలు