హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR : వాహ్... వాట్ ఏ బంపర్ ఆఫర్.. ఇది ఏపీకేనా... ? చీప్ లిక్కర్‌పై కేటిఆర్ ట్వీట్..!

KTR : వాహ్... వాట్ ఏ బంపర్ ఆఫర్.. ఇది ఏపీకేనా... ? చీప్ లిక్కర్‌పై కేటిఆర్ ట్వీట్..!

మంత్రి కేటీఆర్​

మంత్రి కేటీఆర్​

KTR : ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మద్యం పాలసీపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటిఆర్ సెటైర్లు వేశారు.. ఆ పాలసీ ఏపీకేనా..ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అంటూ ఎద్దెవా చేశారు..

ఏపీ బీజేపీ మద్యం పాలసీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం సెటైర్లు వేస్తున్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేత మంత్రి కేటీఆర్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన 50 రూపాయలకే చీఫ్ లిక్కర్‌ సరఫరా మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగాస్త్రాలు విసిరారు...

ఈ క్రమంలోనే "వాహ్. ఏమి పథకం..! ఎంత అవమానకరం, ఏపీ బీజేపి కొత్త పథకానికి దిగజారింది...చీప్ లిక్కర్‌ను 50 రూపాయలకే సరఫరా చేయాలనే విధానం జాతీయ విధానమా లేక ఏపి కా.. లేదంటే నిరాశ అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ పథకాన్ని అమలు చేస్తారా అంటూ ప్రిశ్నిస్తూ ట్వీట్ చేశారు.


కాగా రెండు రోజుల క్రితం విజయవాడలో నిర్వహించిన బీజేపీ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం... చీప్‌ లిక్కర్‌ తయారుచేసి అమ్ముతోందని ఆరోపించారు. మద్యం తాగే ఒక్కొక్కరి నుంచి రూ.12 వేలు రాబట్టి, వాటినే ఏటా అకౌంట్లలో వేస్తోందన్నారు. రాష్ట్రంలో మద్యం తాగే కోటి మంది భాజపాకు ఓటేసి గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే.. చీప్‌ లిక్కర్‌ రూ.70కే ఇస్తామని.. రాబడి బాగుంటే రూ.50కే ఇస్తామని చెప్పారు. అయితే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో తాజాగా మంత్రి కేటిఆర్ స్పందించారు.

Nalgonada : ముందుగా ప్రభుత్వ ఉద్యోగి.. ఆ తర్వాత 6గురు స్నేహితులు.. యువతిపై లైంగిక దాడి.

ఫలితంగా..!

Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: Ap bjp, KTR, Twitter

ఉత్తమ కథలు