హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar : కరీంనగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన... 1000 కోట్లతో అభివృద్ది పనులు

Karimnagar : కరీంనగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన... 1000 కోట్లతో అభివృద్ది పనులు

Karimnagar : కరీంనగర్ పట్టణం గులాబీ మాయమైంది. జిల్లాలో మంత్రి కేటీఆర్..రూ .1030 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత నగరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు..

  ( కరీంనగర్ జిల్లా.న్యూస్ 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి.)

  ఐటి మంత్రి కేటీఆర్ ఈరోజు కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఈ సంధర్భంగా 1000 కోట్ల నిధులతో నగరంలోని పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపలను చేయనున్నారు.. ఉదయం 10.45 గంటలకు కరీంనగర్ చేరుకుంటున్న మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం పలకనున్నారు.. ఇందులో భాగంగానే చైతన్య ఇంజనీరింగ్ కళాశాల నుంచి సుమారు 5 వేల బైకులతో మోటర్ సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశారు. . అనంతరం . రూ .410 కోట్లతో చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులకు సంబంధించి భూమి పూజ చేస్తారు . ఆ తర్వాత మానేరు వంతెన పై ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ నీటి సరఫరా పైలాన్ ఆవిష్కరిస్తారు . అక్కడ నుండి ర్యాలీగా మార్క్ ఫెడ్ ( రామ్ నగర్ ) మైదానానికి చేరుకుంటారు 615 కోట్ల రూపాయలతో చేపట్ట నున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో పాల్గోని ప్రసంగిస్తారు

  ఇక సభ అనంతరం మధ్యాహ్నం మధ్యాహ్నం 1 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి చొప్పదండికి 1.45 గంటలకు చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలను చేస్తారు . సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గోంటారు. అనంతరం ఉజ్వల పార్క్ సమీపంలో రూ .5 కోట్లతో నిర్మించిన బిసి స్టడీ సర్కిల్ ను ప్రారంభిస్తారు . తదుపరి మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంపు కార్యాలయంలో తేనేటి విందుకు వెళతారు. ఆ తర్వాత హైదరాబాద్ కు తిరుగుప్రయాణం కానున్నారు .

  First published:

  Tags: Karimangar, KTR

  ఉత్తమ కథలు