వరి ధాన్యం కొనుగోలు విషయం (Grain purchase controversy) గత కొద్దిరోజులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలారోజులకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (MP Rahul gandhi) ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకుండా రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టె రైతులను క్షోభపెట్టే పనులు మానుకోవాలని హితవు పలికారు. దీంతో పాటు రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు (paddy procurement) చేసేవరకు కాంగ్రెస్ పార్టీ (Congress party) రైతుల తరపున పోరాటం చేస్తుందని అన్నారు. అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) తప్పుపట్టారు.
రాహుల్ గాంధీ (rahul gandhi) స్పష్టంగా తప్పుడు సమాచారం అందిస్తున్నారనీ, వాస్తవ పరిస్థితులపై తప్పుదారి పట్టించాడని కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లపై ఆయన విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. దశాబ్దాలుగా దేశంలోని రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ముందుగా వారికి క్షమాపణ చెప్పాలని ఆయన వరుస ట్వీట్లలో (Tweets) డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉండి పదే పదే తెలంగాణ నుంచి బియ్యాన్ని కొనుగోలు (paddy procurement) చేసేందుకు నిరాకరించిన వారిపై తన విమర్శలను (Criticizes) మళ్లించాలని రాహుల్ గాంధీకి సూచించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలతో టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును పోల్చడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.
24 hrs of free power supply & with focus on irrigation our Hon’ble CM has ushered in a agricultural revolution
What your party couldn’t deliver in 50 years, our Govt has delivered in 7 years To compare the performance of TRS Govt with past INC Govts will put your party to shame — KTR (@KTRTRS) March 29, 2022
మీ పార్టీకి ఈ దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించే అవకాశం లభించిందనిINC అధికారంలో ఉన్నప్పుడు కష్టాలు & ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని కేటీఆర్ (KTR) ఆరోపించారు. రైతులకు 6 గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. అయితే, తమ ప్రభుత్వం మాత్రం తెలంగాణలో మెరుగైన పాలన అందిస్తుందని కేటీఆర్ (KTR) తెలిపారు. తెలంగాణలో రైతు బంధు, రైతు భీమా, మిషన్ కాకతీయ వంటి వినూత్న పథకాలతో ముందుకు సాగుతున్నదని తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా & నీటిపారుదలపై దృష్టి సారించి వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టామని కేటీఆర్ (KTR) తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో అందించలేకపోయిన దాన్ని మా ప్రభుత్వం ఏడు సంవత్సరాల్లో అందించిందని కేటీఆర్ (KTR) తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minister ktr, Paddy, PADDY PROCUREMENT, Rahul Gandhi