హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR | Fuel prices: కేంద్రం ఇంధన ధరల తగ్గింపుపై మంత్రి కేటీఆర్​ విమర్శలు.. మోసపూరితం అంటూ వ్యాఖ్యలు

KTR | Fuel prices: కేంద్రం ఇంధన ధరల తగ్గింపుపై మంత్రి కేటీఆర్​ విమర్శలు.. మోసపూరితం అంటూ వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్​

మంత్రి కేటీఆర్​

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌తోపాటు వంట గ్యాస్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వల్పంగా తగ్గించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్​ స్పందించారు. షాపు యజమాని ధరలను 300 శాతం పెంచి 30 శాతం డిస్కాంట్​ ఇచ్చినట్లుగా ఉందని విమర్శించారు.

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ (Petrol and diesel)తోపాటు వంట గ్యాస్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వల్పంగా తగ్గించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్​  (Minister KTR)స్పందించారు. షాపు యజమాని ధరలను 300 శాతం పెంచి 30 శాతం డిస్కాంట్​ ఇచ్చినట్లుగా ఉందని విమర్శించారు. పెంచింది కొండత.. తగ్గించింది పిసరంత అని అన్నారు కేటీఆర్​. ఈ మేరకు ట్విటర్​లో విమర్శలు గుప్పించారు మంత్రి. ఈ మేరకు ఆయన ట్విటర్​ (Twitter)లో.. ‘నా స్కూల్‌ పక్కన ఉన్న ఓ దుకాణాదారుడు పీక్‌ సీజన్‌లో ధరలను 300 శాతం పెంచి.. ఆపై ప్రజలను మోసం చేయడానికి దానిని 30 శాతం తగ్గించే వాడు. అతని సన్నిహితులు దాన్ని బంపర్‌ ఆఫర్‌గా అభివర్ణిస్తూ.. అతనికి ధన్యవాదాలు తెలిపేవారు. ఇది ఎక్కడో విన్నట్లు అనిపిస్తుందా..? ముందుగా ధరలు పెంచింది ఎవరు?’ అని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దీనికి నెటిజన్లు ‘ఇలాంటి పని చేసేది ఇంకెవరూ.. నరేంద్ర మోదీ (Narednra modi) ప్రభుత్వం’ అంటూ సమాధానాలు ఇచ్చారు.

పెట్రోల్‌ ధర రూ.70 ఉంటే ఇప్పుడు రూ. 120కి..

‘మే 2014, మే 2022లో క్రూడ్‌ ఆయిల్‌ ధర ఏ మాత్రం పెరగలేదు. కానీ, అప్పుడు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.70 ఉంటే ఇప్పుడు రూ. 120కి చేరింది. తెలంగాణలో వ్యాట్‌ అప్పడూ, ఇప్పుడూ ఏ మాత్రం మారలేదు. మరి ధరలు పెరిగేందుకు కారణం ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు? స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ ఇవన్నీ ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం విధించిన పెంపులో భాగమే. ఈ పన్నుల్లో దేనిలోనూ రాష్ట్రాలకు పైసా వాటా కూడా లేదు. కేంద్రం (Center) ఈ సెస్‌ను (Cess) రద్దు చేస్తే ఇంధన ధరలు 2014 నాటి స్థాయికి చేరుకుంటాయి’ అని ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు.

‘పెట్రోలుపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ 2014లో రూ.3.57 ఉంటే.. అది 2022 నాటికి రూ.27.90 అయింది. అంటే కేంద్రం రూ.18.42 పెంచింది. ఇప్పుడు తగ్గించింది రూ.8. డీజిల్‌పై 2014లో 3.57 ఉంటే.. అది 2022 నాటికి రూ.21.80 అయింది. అంటే రూ.18.23 పెంచింది, ఇప్పుడు తగ్గించింది రూ.6. పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత.. తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో వ్యాట్‌ను ఒక్కపైసా కూడా పెంచలేదు’. ‘మోదీ ఫిల్లింగ్‌ స్టేషన్‌.. పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌- ఎక్సైజ్‌ డ్యూటీని భారీగా పెంచారు. యూపీ ఎన్నికల తరువాత ఎవరూ ఊహించనంతగా ధరలు పెంచారు. కానీ ఇప్పుడు దాన్ని స్వల్పంగా తగ్గించారు. దీన్నే మోదీ స్ట్రోక్‌’ అంటారు అని కేటీఆర్‌ ట్వీట్​ చేశారు.

మంత్రి హరీశ్​ సైతం..

పెట్రోల్ ధరలు (Petrol price) చాంతాడంత పెంచి, మూరెడు తగ్గిస్తే సంబురపడిపోవడానికి జనాలు అమాయకులు కారని మంత్రి హరీశ్‌‌రావు అన్నారు. రూపాయి పెంచి, చారాణా తగ్గించి గొప్పలు చెప్పుకుంటోందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి పెట్రోల్‌‌పై రూ.3.40 ఉన్న సెస్‌‌ను ఇప్పుడు రూ.31కి పెంచారు. దమ్ముంటే రూ.3.4కి తగ్గించి గొప్పలు చెప్పుకోవాలి. గ్యాస్ ధరను రూ.400 నుంచి రూ.1,050 చేసి, ఇప్పుడు రూ.200 తగ్గించారు. ఈ తగ్గింపు కూడా పావలా మందికే చేశారు. ఈ జిమ్మిక్కులన్నీ జనాలకు తెలుసు. మా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌‌పై ఒక్క రూపాయి కూడా సెస్ పెంచలేదు. కేంద్రమే పెంచింది కాబట్టి కేంద్రమే తగ్గించాలి” అని హరీశ్ డిమాండ్ చేశారు.

First published:

Tags: Fuel prices, KTR, Petrol Price, Tweets