హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రో సేవలు ప్రారంభం..

హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రో సేవలు ప్రారంభం..

తాజాగా హైటెక్‌సిటీ-రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రులు కేటీఆర్,పువ్వాడ అజయ్ సంబంధిత అధికారులతో కలిసి మెట్రోలో మైండ్ స్పేస్ వద్ద ఉన్న రాయదుర్గం స్టేషన్ వరకు ప్రయాణించారు.

    హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు మరింత విస్తరించాయి. తాజాగా హైటెక్‌సిటీ-రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రులు కేటీఆర్,పువ్వాడ అజయ్ సంబంధిత అధికారులతో కలిసి మెట్రోలో మైండ్ స్పేస్ వద్ద ఉన్న రాయదుర్గం స్టేషన్ వరకు ప్రయాణించారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30గంటల తర్వాత ఈ మార్గంలో మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.ఒకటిన్నర కి.మీ దూరం ఉండే ఈ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి రావడం ఐటీ ఉద్యోగులకు ఉపయోగకరంగా మారనుంది.నిత్యం ట్రాఫిక్ జామ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ఉద్యోగులకు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.

    ఇప్పటివరకు నగరంలో 56కి.మీ మేర మెట్రో సేవలందిస్తోంది. తాజాగా హైటెక్‌సిటీ-రాయదుర్గం మార్గం ప్రారంభం కావడంతో మెట్రో సేవలు 57.50కి.మీ విస్తరించింది. రెండేళ్ల క్రితం నగరంలో మొదటిసారి అమీర్‌పేట్-మియాపూర్ మార్గంలో మెట్రో పరుగులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమీర్‌పేట్-ఎల్బీనగర్,నాగోల్-హైటెక్‌సిటీ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రతీరోజు 4 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు. రాయదుర్గం మార్గం కూడా అందుబాటులోకి రావడంతో మరో లక్ష మంది మెట్రో సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇక జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో సైతం మెట్రో రైలు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ట్రయల్ రన్స్ కొనసాగుతున్నాయి.

    First published:

    Tags: Hyderabad, Hyderabad Metro, Telangana

    ఉత్తమ కథలు