Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్‌లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అందాలు

ఇది దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్డి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువు వంతెనను నిర్మిస్తోంది. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది.

news18-telugu
Updated: September 2, 2020, 10:30 AM IST
Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్‌లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అందాలు
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
  • Share this:
హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అన్ని పనులు దాదాపుగా పూర్తయ్యాయాయి. త్వరలోనే ఈ కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించపోతున్నారు. ఈ క్రమంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అందాలను మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. కేటీఆర్‌ బిడ్జి నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీరింగ్‌ బృందాన్ని ఆయన అభినందించారు. మౌలిక సదుపాయాల కల్పన వృద్ధికి కీలకమని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వం 60శాతం బడ్జెట్‌ను ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు. ఏంతో అందంగా, అద్భుతంగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నగరవాసులను ఆకట్టుకుంటోంది. విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతూ కనువిందు చేస్తోంది. ఎక్కడో విదేశాల్లో ఉన్న ఫీలింగ్‌ను కలగజేస్తోంది. వావ్.. ఈ బ్రిడ్జి చాలా అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంతటి అద్భుతమైన వంతెన ఉందా.. అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇది దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్డి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువు వంతెనను నిర్మిస్తోంది. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. రోడ్‌ నంబర్‌ 36, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లో ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఉపశమనం దొరుకుతుంది.
Published by: Shiva Kumar Addula
First published: September 2, 2020, 9:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading