Home /News /telangana /

MINISTER KTR REVIEW ON DOUBLE BEDROOM HOUSES WILL ALLOT TO POOR PEOPLE IN DECEMBER AK

Telangana 2BHK Houses Scheme: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై తీపికబురు చెప్పిన కేటీఆర్

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ రివ్యూ

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ రివ్యూ

Telangana 2BHK Houses Scheme: ఆగస్టు మాసాంతం నుంచి డిసెంబర్ నెల వరకు పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, వాటిని వెంటవెంటనే పేద ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

    Telangana Govt 2BHK Housing Scheme:: డిసెంబర్ నాటికి హైదరాబాద్ నగరంలో సుమారు 85 వేలకు పైగా ఇళ్లను పేదలకు అందించనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని అన్నారు. సుమారు 9 వేల 700 కోట్ల రూపాయలతో దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంత పెద్ద ఎత్తున జిహెచ్ఎంసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతుందని వెల్లడించారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను సమీక్షించారు. చాల చోట్ల పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో తాగునీరు, విద్యుత్, ఇతర మౌళిక వసతుల పనులు వేగవంతం చేయాలని అన్నారు.

    ఇప్పటికే డబుల్ బెడ్డ రూం ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయని మంత్రి కేటీఆర్‌కి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వరుసగా పేదలకు వాటిని అందించే కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆగస్టు మాసాంతం నుంచి డిసెంబర్ నెల వరకు పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, వాటిని వెంటవెంటనే పేద ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు మరో పది వేలు జెఎన్ఎన్‌యుఆర్ఎం మరియు వాంబే ఇళ్లు ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. జిహెచ్ఎంసి పరిసర జిల్లాలో నిర్మిస్తున్న ప్రాంతాల్లో సుమారు 10% స్థానిక ప్రజల కోసం కేటాయించిన నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Double bed rooms, KTR, Telangana

    తదుపరి వార్తలు