కేంద్రం రైతుల అభివృద్ది కోసం తీసుకువచ్చామని చెప్పిన నూతన రైతుల చట్టాల రద్దు చేయనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో గత సంవత్సర కాలంగా ఆందోళనబాట పట్టిన రైతుల విజయంగా పలువురు నేతలు ప్రకటించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ప్రజలచేత ఎన్నుకోబడి పదవుల్లో ఉన్న వారి బలం కంటే అంతిమంగా ప్రజల బలమే శక్తివంతమైందని అన్నారు. పవర్ ఉన్నవారి కంటే ప్రజల పవర్ ఎప్పటికి శక్తివంతమైనదే అని ట్వీట్ చేశారు. ఈ సంధర్భంగా గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులను అభినందిస్తూ.. జై జవాన్, జైకిసాన్ అంటూ పేర్కోన్నారు.
“The power of people is always greater than the people in power”
Proved once again by the Indian farmers who got what they demanded by their relentless agitation ?
Jai Kisan Jai Jawan#FarmLawsRepealed#TRSwithFarmers#FarmersProtest
— KTR (@KTRTRS) November 19, 2021
ఇక రైతులను నట్టెట ముంచిలా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్లవ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయమని మంత్రి హరీష్ రావు పేర్కోన్నారు. ఏడాది కాలంగా బెల్లెట్ గాయాలకు, లాఠీలకు వాటర్ కెనాన్లకు ,ఎదురెళ్లి విజయం సాధించిన తీరు అధ్బుతమని పేర్కొన్నారు.మరోవైపు మోదీ నిర్ణయం వెనక సీఎం కేసిఆర్ నిన్న చేసిన ఆందోళన ఎఫెక్ట్ ఉందంటూ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కోన్నారు. సీఎం కేసీఆర్ హెచ్చరికలతో మోదీ దిగివచ్చారని పేర్కోన్నారు.
రాత్రింబవళ్ళు రోడ్లపై నిలిచి నిరసనలతో కేంద్రానికి రైతు శక్తిని, పోరాటాన్ని రుచి చూపించారు. ఇది రైతు విజయం, ఇది దేశ ప్రజల విజయం. రైతు ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీలురందరికీ ఉద్యమాభివందనాలు ??
#జైకిసాన్? #TRSwithFarmers
— Harish Rao Thanneeru (@trsharish) November 19, 2021
ఇక ఇదే మోదీ నిర్ణయాన్ని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి స్వాగతించారు. ఇది రైతుల విజయంగా ఆయన అభివర్ణించారు.దేశంలో వాస్తవ పరిస్తిని మోదీ ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. ఈ సంధర్భంగా దేశ రైతాంగానికి ,క్షమాపణలు చెప్పడం హుందాగా ఉందని అన్నారు. ఇక ఈ నిర్ణయం రైతు పోరాటాలకంటే ముందే తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాతో పాటు రైతుల నిరసనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.