Home /News /telangana /

MINISTER KTR RESPONDED ON TWITTER AS BASARA IIT STUDENTS WERE PROTESTING SEEKING A SOLUTION TO THEIR PROBLEMS PRV

Basara IIIT | KTR: బాసర ట్రిపుల్​ఐటీ విద్యార్థుల ఆందోళన.. మంత్రి కేటీఆర్​ ట్వీట్​.. ఏం చెప్పారంటే?

మంత్రి కేటీఆర్​

మంత్రి కేటీఆర్​

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు దిగిన బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ ఆండ్ టెక్నాలజీస్ విద్యార్థులకు ఐటీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు

    తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు దిగిన బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ ఆండ్ టెక్నాలజీస్ విద్యార్థులకు (Basara IIIT Students) ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అండగా నిలిచారు. విశ్వవిద్యాలయ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలంటూ కేటీఆర్ ను ఓ విద్యార్థి కోరాడు. యూనివర్సిటీలో మౌళిక సదుపాయాలను కల్పించాలంటూ 8000 మంది విద్యార్థులు చదువులు పక్కనపెట్టి రోడ్డెక్కారంటూ తేజ గౌడ్ అనే విద్యార్థి ట్విట్టర్ (Twitter) ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో విద్యార్థులకు భరోసానిస్తూ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బాసర RJUKT విద్యార్థుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి (Education Minister Sabita Indrareddy) దృష్టికి తీసుకెళతానని కేటీఆర్ (KTR) హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందేలా చూస్తామని.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.

    ఏం జరిగింది?

    చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చెంతన ఉన్న ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిబుల్ ఐటి (Basara IIIT) కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. వివాదాలు, ఆందోళనలతో వార్తలకెక్కుతోంది. తాజాగా ట్రిబుల్ ఐటీ విద్యార్థులు మరోసారి రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు వేల సంఖ్యలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కళాశాల మెస్ ల లో భోజనం (Food) సరిగా ఉండటం లేదని, విద్యుత్ సమస్య (Power Issue), నీటి సమస్య (water Issue) తీవ్రంగా వెంటాడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు కనీసం ల్యాప్ టాప్ లు కూడా ఇవ్వకుండా చదువు పట్ల అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని, తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ బాసర త్రిబుల్ ఐటీ లోపల సుమారు ఆరు గంటలకు పైగా ఆందోళన (Protest) చేపట్టారు. రెగ్యులర్ వైస్ చాన్సలర్ ను నియమించడంతోపాటు పర్మినెంటు ఉద్యోగులను కూడా నియమించాలని, తాగునీటి సమస్యతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని, ల్యాప్ టాప్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా,గతంలోనూ విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

    గత రెండు సంవత్సరాల నుండి బాసర త్రిబుల్ ఐటీ లోపలికి మీడియాను అధికారులు అనుమతించడం లేదని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బీఎస్పి (BSP) పార్టీ నాయకులు కళాశాలకు చేరుకున్నారు. వారిని కూడా లోనికి అనుమతించకపోవడంతో వారు కూడా విద్యార్థులకు మద్దతుగా ట్రిబుల్ ఐటి కళాశాల ప్రధాన ద్వారం వద్ద తమ నిరసన తెలిపారు. ప్రతి రోజు సమస్యలు వేధిస్తున్నా, విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. బిఎస్పి నాయకులను అరెస్టు చేసి పోలీసులను మోహరించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Basara IIIT, KTR, Tweets

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు