ఆ పోలీసులపై చర్యలు తీసుకోండి... డీజీపీ, హోంమంత్రిని కోరిన కేటీఆర్

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

వనపర్తిలో ఓ వ్యక్తిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Share this:
    వనపర్తిలో ఓ వ్యక్తిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం ఏదైనా...పోలీసులు అనుసరించిన ఈ రకమైన వైఖరి సరికాదని కేటీఆర్ స్పష్టం చేశారు. వేల మంది పోలీసులు చేస్తున్న మంచి పనులకు ఇలాంటి చర్యల వల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు. తన కుమారుడు వద్దని ఎంతగా ప్రాధేయపడుతున్నా... పోలీసులు అతడి తండ్రిని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.    తన తండ్రిని కొట్టొద్దని ఆ కుర్రాడు పోలీసులను ఎంతగా వేడుకున్నా... వారు మాత్రం కనికరించలేదు. ఆ వ్యక్తిని ఇష్టానుసారంగా కొడుతూ పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించుకుని వెళ్లారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం... కొందరు ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: