Home /News /telangana /

MINISTER KTR REACTED TO THE RIOTS IN THE WAKE OF THE CONTROVERSY CREATED BY THE AGNIPATH SCHEME IN ARMY RECRUITMENT PRV

Agnipath scheme protest: అప్పుడు రైతులతో ఆడుకున్నారు.. ఇప్పుడేమో జవాన్లతోనా? కేంద్రంపై కేటీఆర్​ ఫైర్​

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో మంటలు

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో మంటలు

అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ కు వ్యతిరేకంగా మీద దేశవ్యాప్తంగా చెలరేగుతులున్న నిరసనలు, హింసాత్మక ఘటనల మీద తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ స్పందించారు.

    అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ (Agnipath  Recruitment scheme) కు వ్యతిరేకంగా మీద దేశవ్యాప్తంగా  చెలరేగుతులున్న నిరసనలు, హింసాత్మక ఘటనల (Agnipath scheme protest) మీద తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పందించారు. ఈ నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయన్నారు. "అగ్నిపథ్ ఆందోళన (Agnipath scheme protest) కేంద్రానికి కనువిప్పు కావాలి. దేశంలో నిరుద్యోగ సమస్య ఎలా ఉందో వీటిని చూస్తే స్పష్టమవుతుంది. ఇంతకు ముందు రైతుల (Farmers) జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు జవాన్లతో (Soldiers) ఆడుకుంటున్నారు. మొదట వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అన్నారు. ఇప్పుడు నో ర్యాంక్- నో పెన్షన్ అంటున్నారు' అంటూ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.

    కాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో (Secunderabad railway station) ఆందోళనకారులు విధ్వంసం కొనసాగుతోంది. రైలు పట్టాలపై పార్సిళ్లు, ఫర్నిచర్సన్న ధ్వంసం చేశారు. అలాగే రైలు బోగీలను సైతం ధ్వంసం చేశారు. మరోవైపు ఆందోళన కారులను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరుపుతున్నారు.



    ఏం జరిగింది?

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) రణ రంగమైంది. అగ్నిపథ్ ఆర్మీ నియామకాలను (AgnipathRecruitmentScheme )వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్‌లోని ఫర్నిచర్, షాపులను ధ్వంసం చేశారు. పట్టాలపై ఆగి ఉన్న మూడు రైళ్లకు నిప్పుపెట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. రాళ్లు దాడులు చేశారు. ఈ క్రమంలోనే రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు.

    గాల్లోకి 15 రౌండ్ల కాల్పులు జరపడంతో కొన్ని బుల్లెట్స్ ఆందోళనకారులను తగిలినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా.. కాసేపటికే మృతి చెందాడు. మరికొందరు నిరసనకారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మొత్తం మూడు రైళ్లు తగలబడ్డాయి. దర్భంగా, ఈస్ట్‌కోస్ట్, అజంతా ఎక్స్‌ప్రెస్ రైళ్లు మంటల్లో కాలిపోయాయి. స్టేషన్‌లో ఉన్న షాపులు, ఇతర ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేయడంతో.. కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిజాం కాలంలో నిర్మించారు. ఈ స్టేషన్ చరిత్రలోనే ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఈ స్థాయిలో ఎప్పుడూ విధ్వంసం జరగలేదు. స్టేషన్ పూర్తిగా కళతప్పిపోయింది. ధ్వంసమైన షాపులు.. పగిలిపోయిన అద్దాలు... కాలిపోయిన రైళ్లతో.. స్టేషన్ మొత్తం గందరగోళంగా మారిపోయింది.

    స్టేషన్లలో భద్రత..

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను (Nampally Railway Station) మూసేశారు. ప్రయాణికులెవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.అంతేకాకుండా వరంగల్ నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ వైపు వచ్చే రైళ్లను వరంగల్ స్టేషన్లోనే నిలిపివేశారు. కాజిపేట, మహబూబాబాద్, తదితర స్టేషన్లలో భద్రత పెంచారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Agnipath Protest, Agnipath Scheme, KTR, Secunderabad railway station

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు