హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR America tour: అమెరికాలోని లాస్​ ఏంజిల్స్​కు చేరుకున్న మంత్రి కేటీఆర్.. ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు.. 

KTR America tour: అమెరికాలోని లాస్​ ఏంజిల్స్​కు చేరుకున్న మంత్రి కేటీఆర్.. ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు.. 

అమెరికాలో మంత్రి కేటీఆర్​

అమెరికాలో మంత్రి కేటీఆర్​

హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రి కేటీఆర్​కు టీఆర్​ఎస్​ పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం తెలిపారు.

  తెలంగాణ (Telangana) రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు (Investments) తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కే. తారకరామారావు (Minister KTR) కి ఈరోజు ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి అమెరికా (America)లోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ  కార్యకర్తలు నాయకులు (TRS leaders) మరియు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం తెలిపారు. ఎయిర్పోర్టులో (Airport) మంత్రి కేటీఆర్ కి పూల బొకేలు అందించి స్వాగతం (Welcomed) తెలిపారు.

  మంత్రి కే తారకరామారావు లాస్ ఏంజిల్స్ (Los Angeles)లో తనకు స్వాగతం పలికిన ఎన్నారైలతో తర్వాత కాసేపు ముచ్చటించారు (Chit chat with NRI). ఈ సందర్భంగా తెలంగాణ (Telangana ) అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల పైన ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ మన ఊరు మన బడి (Our Village our school) కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని (wants to participate)మంత్రి కేటీఆర్ కోరారు. అమెరికా లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా (As ambassadors) వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

  లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, న్యూయార్క్ నగరాల్లో పర్యటించి..

  రాష్ట్రానికి మరిన్నిపెట్టుబడులు (Investments) తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు మరియు ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు వెళ్లారు. ప్రతినిధుల బృందం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ (Los angels), శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించి అనేక కంపెనీల అధిపతులు, సీనియర్ ప్రతినిధి బృందాలతో సమావేశమవుతారు.

  లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో..

  వారం రోజులకు పైగా కొనసాగనున్న ఈ పర్యటన (KTR America tour)లో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పలు ఐటి, ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ (IT, Electronics Food Processing), లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో సమావేశమవుతారు. గతంలో అమెరికాలో పర్యటించి పెద్దఎత్తున పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చిన కేటీఆర్ ఈ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులను (Investments) తెలంగాణకు తీసుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్ (Minister KTR) తో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమలు ఐటీ శాఖకు చెందిన పలు విభాగాల డైరెక్టర్లు ఈ పర్యటనలో పాల్గొంటారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: America, Minister ktr, NRI

  ఉత్తమ కథలు