MINISTER KTR POSTS A PHOTO IN TWITTER AND ASKED WHERE IS IT VRY
KTR : ఇది ఎక్కడుందో చెప్పగలరా... ? మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ప్రశ్న ..
police tower
KTR : హైదరాబాద్ అభివృద్దితో పాటు అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో ఇటివల కొన్ని ఫోటోలు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేసిన ఇది ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు.
హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయం స్థాయిలో అభివృద్ది చేసేందుకు నగరంలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లతో పాటు ఇతర నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ యూజర్లకు ఓ ప్రశ్న సంధించారు. బహుళ అంతస్తుల్లో ఉన్న ఓ భవనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి.. ఇది ఎక్కడ ఉందో చెప్పగలరా? అంటూ కేటీఆర్ నెటిజన్లను ప్రశ్నించారు.
కాగా, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో నిర్మిస్తున్న పోలీసు టవర్‌ను ఆయన పోస్ట్ చేశారు.. కాగా ఆయన షేర్ చేసిన ఫోటో ఎక్కడో విదేశాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బహుళ అంతస్తుల్లో ఉన్న ఆ భవనం ఆకాశాన్ని తాకినట్లు ఉండగా... భవనం చుట్టు ఉన్న ప్రాంతం మొత్తం విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. ఆ భవనం చుట్టూ చిన్నచిన్న భవన సముదాయాలు కనిపిస్తున్నాయి.. కాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవనం మొత్తం నాలుగు టవర్లతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. ఒక టవర్‌ను 20 అంతస్తులతో నిర్మిస్తుండగా.., మిగతా మూడు టవర్లను 16 అంతస్తులతో నిర్మాణం చేపట్టారు... ఈ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్, పోలీసు ఉన్నతాధికారులు నిర్మాణ పనులను పరిశీలించగా కొద్ది రోజుల్లోనే నిర్మాణ పనులు పూర్తయి అందుబాటులోకి రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.