Home /News /telangana /

MINISTER KTR PARTICIPATED IN HARITHA HARAM IN RAJANNA SIRCILLA SK

చెరువులు, కుంటల పక్కన మొక్కలు నాటాలి.. మంత్రి కేటీఆర్ పిలుపు

మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్

కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగలేదని చెప్పారు మంత్రి కేటీఆర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు రైతుబంధు డబ్బులను అందజేశామని తెలిపారు.

    వాగులు, చెరువులు, నదులు, కుంటల పక్కన విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రజలంతా హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంహించారు. ఆవునూరు- వెంకటాపూర్‌ దగ్గర మానేరు వాగులో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతోందని అన్నారు. రాజన్న సిరిసిల్లలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కోటి 40 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. తెలంగాణలో అడవులు 33 శాతానికి పెంచాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్.

    తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన. నర్మాల నుంచి మానేరు వాగు నీటితో కళకళలాడుతోంది. ఎగువ మానేరు నుంచి మధ్యమానేరు వరకు 11 చెక్‌డ్యాంలు నిర్మిస్తాం. సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం.
    మంత్రి కేటీఆర్


    కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగలేదని చెప్పారు మంత్రి కేటీఆర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు రైతుబంధు డబ్బులను అందజేశామని తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా చేసుకునేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారన్న ఆయన.. తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా మారిందని ఎఫ్‌సీఐ సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు.
    First published:

    Tags: Haritha haram, KTR, Telangana, Telangana News

    తదుపరి వార్తలు