హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR: ముందు ఆ కమిషనర్​ను సస్పెండ్​ చేయండి.. ఉద్యోగులకు షోకాజ్​ నోటీసులపై మంత్రి కేటీఆర్​ సీరియస్​

KTR: ముందు ఆ కమిషనర్​ను సస్పెండ్​ చేయండి.. ఉద్యోగులకు షోకాజ్​ నోటీసులపై మంత్రి కేటీఆర్​ సీరియస్​

మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు (KTR birthday) వేడుకలకు హాజరు కాలేదంటూ ఉద్యోగులకు ఉన్నతాధికారులు షోకాజ్​ నోటీసులు ఇచ్చిన వ్యవహారం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్​ అయ్యారు.

  మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు (KTR birthday) వేడుకలకు హాజరు కాలేదంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలోని ముగ్గురు ఉద్యోగులకు ఉన్నతాధికారులు షోకాజ్​ నోటీసులు ఇచ్చిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి కేటీఆర్ దృష్టికి విషయం వెళ్లడంతో ఆయన స్పందించారు. మున్సిపల్ కమిషనర్ మెమో జారీ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనికి బాధ్యుడైన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్​ను సస్పెండ్ చేయాలని ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

  అసలేం జరిగింది?

  ఈ నెల 24వ తేదీన మంచిర్యాల (Mancherial) జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో (Municipal Office) రాష్ట్ర ఐటి శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. బెల్లంపల్లి శాసన సభ్యుడు దుర్గం చిన్నయ్య ఈ వేడుకలకు హజరై కేక్ కట్​ చేసి సంబురాలు జరుపుకున్నారు. అయితే సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ పున్నంచందర్, సిస్టం మేనేజర్ మోహన్, బిల్ కలెక్టర్ శ్రావణ్ ఈ వేడుకలకు హజరు కాలేదు.

  అధినేత మెప్పుకోసం..?

  దీంతో ఆగ్రహించిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలకు హజరు కాని ఆ నలుగురు మున్సిపల్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గైర్హాజరుకు కారణాలు తెలుపుతూ వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో వేడుకలు జరగగా, హజరుకాని మున్సిపల్ ఉద్యోగులకు మరునాడు అంటే సోమవారం నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. వ్యక్తి గత కారణాలతో హజరు కాలేకపోయినప్పటికి, అధినేత మెప్పుకోసం స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే కమిషనర్ మున్సిపల్ ఉద్యోగులకు ఇలా షోకాజ్ నోటీసులు జారీ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

  రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు (Birthday Celebrations) దూరంగా ఉన్నారు కేటీఆర్​. భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్ (Gift A Smile)’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేస్తూ మానవత్వం చాటుకున్నారు. అయితే మంచిర్యాలలో మాత్రం ఇలా ఉద్యోగులకే షోకాజ్​ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాశం అయింది.

  అటు ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ కూడా మండిపడింది. ఒక అవినీతి పరుడి పుట్టినరోజు తెలంగాణ ప్రజలకు పర్వదినమా, అంత మాత్రానికే చిన్న ఉద్యోగులపై ప్రతాపం చూపుతారా అంటూ ఫైర్ అయ్యింది. ఈ మేరకు సదరు మెమోను ట్వీట్ చేసింది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో కేటీఆర్​ స్పందించారు. ఏకంగా కమిషనర్​పైనే వేటు వేయాలని ఆదేశించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Birthday, KTR, Mancherial, Municipal Corporations, Telangana Government

  ఉత్తమ కథలు