హోమ్ /వార్తలు /తెలంగాణ /

ktr : ఆ ప్రాంతాన్ని విలీనం చేయండి... లేదంటే.. అభివృద్ది చేయండి.. కేటిఆర్ ట్వీట్..

ktr : ఆ ప్రాంతాన్ని విలీనం చేయండి... లేదంటే.. అభివృద్ది చేయండి.. కేటిఆర్ ట్వీట్..

మంత్రి కేటీఆర్​

మంత్రి కేటీఆర్​

ktr : కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై మరోసాకి మంత్రి కేటిఆర్ స్పందించారు. రోడ్ల మూసివేతపై ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు.

కంటోన్మెంట్ రోడ్లతో పాటు ఆ ప్రాంత అభివృద్దిపై మంత్రి కేటిఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ది చేయండి లేదంటే ఆ ప్రాంతాన్ని విలీనం చేయండి అంటూ కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రాజ్‌నాథ్ సింగ్‌కు ట్వీట్ చేశారు. ( Minister ktr on cantonment roads ) ఇప్పటికే కంటోన్మెంట్‌లో 21 రోడ్లను మూసి వేశారని చెప్పారు. రోడ్ల మూసివేతతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.( Minister ktr on cantonment roads ) సమస్య పరిష్కరానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్పందించడం లేదని పేర్కోన్నారు. రోడ్ల మూసివేతతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారని , కంటోన్మెంట్ బోర్డు అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.( Minister ktr on cantonment roads ) కంటోన్మెంట్‌లో కేవలం రెండు రోడ్లు మాత్రమే మూశామని పార్లమెంట్‌లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ప్రకటన చేశారని కాని,.. స్థానికంగా 21 రోడ్లు మూసివేశారని తెలిపారు. ఇప్పటికైనా.. సమస్యలు పరిష్కరించలేక పోతే.. జీహెచ్‌హెంసీలో విలీనం చేసి అభివృద్ది చేస్తామని పేర్కోన్నారు.

కాగా కొద్ది రోజుల క్రితం కూడా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రోడ్ల మూసివేతతో పాటు కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కోరుతూ లేఖ రాశారు. ( Minister ktr on cantonment roads ) కాగా చాలా సంవత్సరాలుగా కంటోన్మెంట్ ప్రాంతంలో రాత్రి పూట కొన్ని రోడ్లను మూసి వేయడంతో స్థానిక ప్రజలు చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.( Minister ktr on cantonment roads ) మరోవైపు ఫ్లై ఓవర్ వేసేందుకు కూడా కేంద్రం అంగీకరించడం లేదు.. దీంతో కంటోన్మెంట్ వ్యవహారం రెండు ప్రభుత్వాల మధ్య చిలికి చిలికి గాలివానగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Bihar : తప్పిపోయి 12 ఏళ్లకు పాకిస్తాన్ జైల్లో తేలాడు... భార్యకు పెళ్లయింది.. ఇప్పుడేం చేయాలి...?


CM KCR : భార్య,భర్తలు ఒకే దగ్గర పనిచేసే విధంగా చూడండి.. కలెక్టర్ల‌తో సీఎం


Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: KTR, Rajnath Singh

ఉత్తమ కథలు