హోమ్ /వార్తలు /తెలంగాణ /

Minister KTR accident: బ్రేకింగ్​ న్యూస్​.. మంత్రి కేటీఆర్​కు ప్రమాదం.. 

Minister KTR accident: బ్రేకింగ్​ న్యూస్​.. మంత్రి కేటీఆర్​కు ప్రమాదం.. 

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

టీఆర్​ఎస్​ కార్యకర్తలు, అభిమానులు అంతా మంత్రి పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.  ఈ సమయంలో అందరూ ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు. ఎందుకంటే మంత్రి కేటీఆర్ (Minister KTR)కు ప్రమాదం సంభవించింది.

  రేపు (జూలై 24) టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ (Minister KTR)​ పుట్టినరోజు. టీఆర్​ఎస్ (TRS)​ కార్యకర్తలు, అభిమానులు అంతా మంత్రి పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.  ఈ సమయంలో అందరూ ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు. ఎందుకంటే మంత్రి కేటీఆర్ (Minister KTR)కు  ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఆయన కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. "ఇవాళ ప్రమాదవశాత్తూ (Accidentally) జారి పడటంతో ఎడమకాలు చీలమండ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలో ఓటీటీ షో (OTT Shows)ల గురించి ఎవరైనా సలహా ఇవ్వండి" అని కేటీఆర్ తెలిపారు. కాలికి కట్టుతో ఉన్న ఫొటోను కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు.

  అయితే ఇప్పటికే కేటీఆర్ పుట్టినరోజున (KTR Birthday) రాష్ట్రవ్యాప్తంగా కేక్‌ కటింగ్‌ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, హోమాలు, సర్వమత ప్రార్థనలు, చీరలు, పండ్లు, అన్నదానం చేసేందుకు మంత్రులు, TRS పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు, యువతకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. కాగా, అభిమానులకు కేటీఆర్​ షాక్​ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

  రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు (Birthday Celebrations) దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్ (Gift A Smile)’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేస్తూ మానవత్వం చాటుకున్నారు.

  హైదరాబాద్‌ (Hyderabad)లోని టీఆర్ఎస్ (TRS) కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయికిరణ్ యాదవ్ నేతృత్వంలో కేటీఆర్​ పుట్టినరోజు వేడుకలు (KTR Birthday నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ పేరుమీద 116 ఆలయాల్లో అర్చనలు చేయిస్తామని, త్రీడీ గ్రాఫిక్స్ తో స్పెషల్ కేక్, కేటీఆర్ జీవితంపై ఓ డాక్యుమెంటరీ (Documentary)రూపొందిస్తామని సాయి కిరణ్ యాదవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ద లీడర్ ఫ్రం ద లోకల్ టు గ్లోబల్ పేరిట డాక్యుమెంటరీ విడుదల ఉంటుందన్నారు. కేటీఆర్ (KTR) ప్రస్థానం యావత్తు ఈ డాక్యుమెంటరీ చిత్రంలో చూడొచ్చని పేర్కొన్నారు. ఇక కేక్ లో గత ఎనిమిదేళ్లలో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ‘రైజ్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో చూడవచ్చని చెప్పారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Accident, KTR, Minister ktr, Telangana, Twitter

  ఉత్తమ కథలు