గత మార్చిలో మంత్రి కేటీఆర్ (Minister KTR) అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్లో తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు లైఫ్ సైన్సెస్ (Life sciences), ఫార్మా (Pharma) కంపెనీలు ముందుకొచ్చాయి. కేటీఆర్ (Minister KTR) తో సమావేశం అనంతరం తమ నిర్ణయాలు కంపెనీలు వెల్లడించాయి. న్యూయార్క్ (Newyork)లోని అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ (Advent International) హెడ్ క్వార్టర్స్‌లో ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో కేటీఆర్ సమావేశం అయ్యారు. భారత్‌లోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్ (Hyderabad)లో అడ్వెంట్ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో వారు చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆర్ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్, అవ్రా ల్యాబొరేటరీస్ (Avra Laboratories)లో మెజార్టీ వాటాలు కొనేందుకుపెట్టుబడులు పెట్టబోతున్నట్లు మంత్రి కేటీఆర్‌కు అడ్వెంట్ కంపెనీ (Advent) తెలిపింది. ఆ పెట్టుబడుల నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. కాగా, పెట్టుబడుల విషయాన్ని కేటీఆర్ తన ట్వీట్ల ద్వారా వెల్లడించారు. ఇక తాజాగా కేటీఆర్ యూకేలో పర్యటిస్తున్నారు. యూకే (United Kingdom)లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన (Minister KTR UK tour) తొలిరోజు బిజీబిజీగా సాగింది.
తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను (Business trade opportunities) ఇక్కడి సంస్థలకు పరిచయం చేశారు. ఇందులో భాగంగా యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో (In round table meetings)పాల్గొనడంతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
కంపెనీలను సాదరంగా స్వాగతిస్తున్నామని..
తెలంగాణ (Telangana) రాష్ట్ర వినూత్నమైన పారిశ్రామిక పాలసీలతో పాటు పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, భూమి, నీరు (water), విద్యుత్ సదుపాయాలతో పాటు నాణ్యమైన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమమైన మౌలిక వసతులు, పాలసీలు, ప్రోత్సాహకాలు తెలంగాణలో ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను సాదరంగా స్వాగతిస్తున్నామన్నారు మంత్రి. టీఎస్ ఐపాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), బ్యాంకింగ్ ఫైనాన్స్ , ఫుడ్ ప్రాసెసింగ్ (Food processing), ఫార్మా-లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు కోసం తీసుకువచ్చిన పాలసీలు, వాటితో ఇప్పటిదాక తెలంగాణకు వచ్చిన భారీ పెట్టుబడుల వివరాలను కంపెనీ ప్రతినిధులకు తెలియచేశారు కేటీఆర్ .
ఇక తెలంగాణ (Telangana) ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ (international pharma company) పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్‌కు చెందిన సర్పేస్ మెజెర్ మెంట్ సిస్టమ్స్ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబొరేటరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సర్పేస్ మెజెర్ మెంట్ సంస్థ ఎండీ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
7 వేల చ.మీ. వైశాల్యంలో ల్యాబొరేటరీ..
హైదరాబాద్ (Hyderabad)లో 7 వేల చ.మీ. వైశాల్యంలో ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తామని సర్పేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ వెల్లడించింది. రెండేళ్లలో దీనిని విస్తరిస్తామని .. ఈ ల్యాబ్‌ను జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు వేదికగా చేస్తామని ఆ సంస్థ ఎండీ .. కేటీఆర్‌కు తెలియజేశారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.