ఆ పరిస్థితి రావొద్దు.. అందుకే హరితహారం అన్న కేటీఆర్

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)

సిరిసిల్లలో 19.85 శాతం అడవులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అడవులు 33 శాతానికి పెంచాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని కేటీఆర్ తెలిపారు.

  • Share this:
    భవిష్యత్తులో నీరు కొనుక్కుని తాగే పరిస్థితి వస్తుందని బ్రహ్మంగారు చెబితే ఎవరూ నమ్మలేదని... కానీ అదే జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అదే విధంగా భవిష్యత్తుల్లో స్వచ్ఛమైన గాలి కొనుక్కునే పరిస్థితి రావొద్దనే ఉద్దేశ్యంతోనే హరితహారం వంటి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించారు. ఆవునూరు-వెంకటాపూర్‌ దగ్గర మానేరు వాగులో హరితహారంలో భాగంగా వీరు మొక్కలు నాటారు. రాజన్న సిరిసిల్లలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

    జిల్లాలో ఇప్పటివరకు కోటి 40 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. సిరిసిల్లలో 19.85 శాతం అడవులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అడవులు 33 శాతానికి పెంచాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని కేటీఆర్ తెలిపారు. కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్నా... సంక్షోభంలోనూ ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగలేదని కేటీఆర్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు రైతుబంధు అందజేసినట్లు వివరించారు. వ్యవసాయాన్ని పండుగలా చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కోనుగోలు చేసినట్లు చెప్పారు. తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా మారిందని ఎఫ్‌సీఐ సైతం ప్రశంసించిందని కేటీఆర్ గుర్తు చేశారు.




    First published: