హోమ్ /వార్తలు /తెలంగాణ /

సొంత పార్టీ నేతకు షాకిచ్చిన మంత్రి కేటీఆర్..

సొంత పార్టీ నేతకు షాకిచ్చిన మంత్రి కేటీఆర్..

తెలంగాణ మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)

తెలంగాణ మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)

Telangana Minister KTR: తనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నాయకుల తీరుపై మంత్రి కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు.

    నగరంలో ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని గతంలోనే తమ పార్టీ నేతలను ఆదేశించిన మంత్రి కేటీఆర్... ఈ నిబంధనను ఉల్లంఘించిన సొంత పార్టీ నేతకు షాకిచ్చారు. తనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నాయకుల తీరుపై మంత్రి కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఎర్రగడ్డ కార్పొరేటర్‌ షాహీన్‌ బేగంకు రూ.20వేల జరిమానా వేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అంతేకాదు మాస్క్‌ లేకుండా కార్యక్రమానికి వచ్చినందుకు కార్పొరేటర్‌ భర్త షరీఫ్‌కు రూ.వెయ్యి జరిమానా వేయాలని సూచించారు. కార్పొరేటర్‌ దంపతులకు జరిమానా విధించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఎర్రగడ్డలోని యాదగిరి నగర్‌, సుల్తాన్‌ నగర్‌ బస్తీల్లో మంత్రి కేటీఆర్‌ బస్తీ దవాఖానలు ప్రారంభించారు.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: GHMC, KTR, Telangana, Trs

    ఉత్తమ కథలు