Home /News /telangana /

MINISTER KTR EXPRESSED HIS ANGER OVER THE RELEASE OF THE GANG RAPE ACCUSED BY THE GUJARAT GOVERNMENT PRV

KTR: రేపిస్టులను వదిలెయ్యడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం.. ప్రధాని మోదీకి ట్వీట్​

కేటీఆర్​, మోదీ (ఫైల్​)

కేటీఆర్​, మోదీ (ఫైల్​)

బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ దోషులను.. రెమిషన్‌ ఆదేశాల కింద గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేయడంపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్​ సైతం ట్విటర్‌ వేదికగా స్పందించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ (Gang Rape) దోషులను.. రెమిషన్‌ ఆదేశాల కింద గుజరాత్‌ ప్రభుత్వం (Gujarat Government) విడుదల చేయడంపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. గుజరాత్‌ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుండగా.. విపక్షాలు, మేధోవర్గం ఈ విషయంలో గుజరాత్‌ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఏకీపడేస్తున్నాయి. ఈ క్రమంలో.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ (Minister KTR)​ సైతం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ప్రియమైన మోదీ గారు .. మహిళల గౌరవం గురించి మీరు మాట్లాడడం నిజమే అయితే.. ఈ విషయంలో జోక్యం చేసుకోండి. పదకొండు మంది రేపిస్టులను (Rapists) విడుదల చేసిన గుజరాత్‌ ప్రభుత్వపు ఆదేశాలను రద్దు చేయించండి. ఈ ఆదేశాలు వెగటు పుట్టించేవిగా ఉన్నాయి. మీరు జోక్యం చేసుకుని చిత్తశుద్ధి చూపించాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు కేటీఆర్‌. అంతేకాదు.. సార్‌.. ఐపీసీ (IPC), సీఆర్‌పీసీలో (CRPC) రేపిస్టులకు బెయిల్‌ దొరక్కుండా ఉండేందుకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని, బలమైన చట్టాలతోనే న్యాయవ్యవస్థ పటిష్టంగా, వేగంగా పని చేస్తుందని మరో కొనసాగింపు ట్వీట్‌లో కేటీఆర్‌ పేర్కొన్నారు .



    మోదీ లక్ష్యాలపై కేటీఆర్​ సెటైర్లు..

    సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడంపై ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ స్పందించారు. నిర్దేశించుకొన్న లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన చిత్తశుద్ధి మోదీకి లేదన్నారు. రాబోయే పాతికేండ్లకు కొత్త లక్ష్యాలు నిర్దేశించడం వినడానికి బాగున్నదే కానీ.. ఇప్పటివరకు సాధిస్తామని చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.


    ఏపీలోనూ..

    ఎర్రకోట వేదికగా 2047 కోసం ప్రధాని మోదీ తన ప్రసంగంలో కొన్ని కొత్త లక్ష్యాలపై మాట్లాడం వినడానికి ఎంతో బాగున్నది. కానీ అధికారంలో వచ్చినప్పటి నుంచి చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదన్న సంగతిని మోదీ ఇప్పటికైనా గుర్తించాలి. 2014లో 2022 నాటికి దేశ రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, విద్యుత్తు, టాయిలెట్‌, ప్రతి భారతీయుడికీ సొంత ఇల్లు కట్టిస్తామనడంతోపాటు.. 2018లో మన ఆర్థిక వ్యవస్థను 2022 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్లుగా మారుస్తానన్న హామీల్లో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

    ‘లక్ష్యాల సాధనలో ఎదురైన వైఫల్యాన్ని ఒప్పుకోకుండా కొత్తవాటి గురించి చెప్తే విశ్వసనీయత ఏముంటుంది? మీ లక్ష్యాలను మీరే గుర్తించలేనప్పుడు జవాబుదారీతనం ఎకడ ఉంటుంది’ అని ప్రశ్నించారు. ప్రధాని గతంలో చేసిన వాగ్దానాల గురించి దేశ ప్రజలు తెలుసుకోవాలని భావిస్తున్నారంటూ.. క్యా హువా తేరా వాదా అనే హ్యాష్‌ ట్యాగ్‌తో మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. నెటిజన్లు సైతం మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా మోదీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: KTR, PM Narendra Modi, Tweets

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు