హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR : మా రాజకీయం ఆర్నెళ్లే.. మిగతా అంతా అదే! కేటీఆర్ హాట్ కామెంట్

KTR : మా రాజకీయం ఆర్నెళ్లే.. మిగతా అంతా అదే! కేటీఆర్ హాట్ కామెంట్

Minister KTR File Photo

Minister KTR File Photo

హైదరాబాద్ HICCలో జరిగిన నాస్కామ్ జీసీసీ కాంక్లేవ్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశ రాజకీయాలు, తెలంగాణ ప్రాధాన్యాల గురించి వివరించారు.

KTR : మహారాష్ట్రలో జరుగుతున్న తాజా పరిణామాలపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు - KTR హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ HICCలో జరిగిన నాస్కామ్ జీసీసీ కాంక్లేవ్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశ రాజకీయాలు, తెలంగాణ ప్రాధాన్యాల గురించి వివరించారు.


తెలంగాణలో తాము ఎన్నికలకు ముందు ఆరు నెలలు మాత్రమే రాజకీయం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. మిగతా నాలుగున్నరేళ్లు అభివృద్ధిపై ఫోకస్ చేస్తామన్నారు. ఉద్యోగాలు కల్పించడం, జనం సంక్షేమ పథకాలు అమలు చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపైనే దృష్టి పెడతామన్నారు. అలాంటి ప్రభుత్వం ఇపుడు హిందూస్థాన్ కు కావాలన్నారు. తెలంగాణలో ఉన్న తమది అలాంటి ప్రభుత్వమే అన్నారు కేటీఆర్.

దేశంలో ఏ రాష్ట్రం, ఏ ప్రధాన నగరానికైనా వెళ్లి చూడండి.. తెలంగాణకు, హైదరాబాద్ కు వచ్చి చూడండి.. తాను చెబుతున్న మాటల్లో వాస్తవం ఏంటో మీకే తెలుస్తుంది అని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారని చెప్పారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం, విధానాలు అమలులో ఉన్నాయన్నారు.

హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాల అభివృద్ధిపై తాము ఫోకస్ చేశామన్నారు కేటీఆర్. పబ్లిక్ ట్రాన్స్‌పొటేషన్ ను గతంలో ఎన్నడూ లేని విధంగా మెరుగుపరిచామన్నారు. గడిచిన ఐదేళ్లలో 30 ఫ్లై ఓవర్లు కట్టడం ఓ హిస్టరీ అని చెప్పారు కేటీఆర్. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరు, అంతరాయం లేని కరెంట్ ఇస్తున్న ఒకే రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు కేటీఆర్.

హైదరాబాద్ ను మోస్ట్ లివబుల్ సిటీగా మార్చాలనుకుంటున్నామని కేటీఆర్ అన్నారు. ఐటీ సిటీ బెంగళూరు రూట్స్ కూడా హైదరాబాద్ తోనే ముడి పడి ఉన్నాయన్నారు. ఇక్కడి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లోనే చాలామంది చదువుకున్నారని చెప్పారు. దక్షిణాదికి ఉత్తరాదికి హైదరాబాద్ ముఖద్వారం లాంటిదనీ.. ఏ భాష వారైనా.. ఏ రాష్ట్రం వారైనా ఇక్కడ స్థానికులు అనే భావన కలిగేలా వాతావరణం పెంపొందిస్తున్నామని చెప్పారు. అందుకే హైదరాబాద్ అన్ని నగరాలను మించి ప్రగతి సాధిస్తోందని.. అన్ని రంగాలకు హబ్ గా మారిందని.. అవకాశాలు అందుకోవాలని కంపెనీలకు పిలుపునిచ్చారు కేటీఆర్.

First published:

Tags: Hyderabad, KTR, Maharastra, Telangana

ఉత్తమ కథలు