• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • MINISTER KTR CLARIFIES ON WARD OFFICERS IN MUNICIPALITIES OF TELANGANA AK

Minister KTR: వార్డు ఆఫీసర్లపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన

Minister KTR: వార్డు ఆఫీసర్లపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన

తెలంగాణ మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)

KTR News: మున్సిపాలిటీల్లో త్వరలోనే వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడతామని తెలిపారు.

  • Share this:
    Minister KTR on Ward Officers: తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి కోసం వార్డుకు ఒక్కో ఆఫీసర్‌ను నియమిస్తామని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన అసెంబ్లీలో మరింత క్లారిటీ ఇచ్చారు. మున్సిపాలిటీల్లో త్వరలోనే వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడతామని తెలిపారు. అలా నియామకమైన అధికారులకు మొదటి మూడేళ్ల ప్రొబేషనరీ కాల పరిమితి ఉంటుందని వెల్లడించారు. వార్డు ఆఫీస్ కార్యాలయాలు కూడా నిర్మిస్తున్నామని అన్నారు. కార్పొరేటర్, వార్డు ఆఫీసర్ కలిసి పని చేస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

    ఇక హైదరాబాద్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్ కార్పొరేషన్‌కు ఇవ్వాల్సిన నిధులు ఇస్తుందని వివరించారు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఆస్తిపన్ను, నీటిపన్ను పెంచలేదని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎస్ఆర్‌డిపి ద్వారా ద్వారా పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. అక్టోబర్ 2 వరకు 11వేల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణలు పూర్తి చేస్తామని కేటీఆర్ చెప్పారు.
    Published by:Kishore Akkaladevi
    First published: