నా జలుబుకు అదే కారణం... క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

హఠాత్తుగా తన పర్యటన రద్దు చేసుకుంటే... కొందరు ఇబ్బందిపడతారనే కారణంగానే జలుబుతోనే సిరిసిల్ల జిల్లాలో పర్యటించానని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

news18-telugu
Updated: May 12, 2020, 2:17 PM IST
నా జలుబుకు అదే కారణం... క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
కేటీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
తాను జలుబుతో బాధపడుతుండటంపై కొందరు నెటిజన్లు ఆందోళన చెందడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను కొన్నేళ్లుగా జలుబుతో కూడిన అలర్జీతో బాధపడుతున్నానని... ఇటీవల సిరిసిల్ల పర్యటన సందర్భంగా అలాంటి జలుబు కారణంగానే కొంత ఇబ్బందిపడ్డానని ఆయన వివరించారు. అయితే హఠాత్తుగా తన పర్యటన రద్దు చేసుకుంటే... కొందరు ఇబ్బందిపడతారనే కారణంగానే జలుబుతోనే సిరిసిల్ల జిల్లాలో పర్యటించానని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. దీని వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని కేటీఆర్ ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. అంతకుముందు కేటీఆర్ జలుబుతో బాధపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.



దీంతో కొందరు నెటిజన్లు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. కోవిడ్ 19పై జరుగుతున్న పోరులో మీరు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని... మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ అనేక మంది ట్విట్ చేశారు. వారి ట్వీట్స్‌కు సంబంధించిన మంత్రి కేటీఆర్... దీనిపై వివరణ ఇచ్చారు.




First published: May 12, 2020, 2:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading