Home /News /telangana /

kandikonda : కందికొండ కుమార్తె లేఖపై స్పందించిన minister ktr -గేయ రచయిత కుటుంబానికి అండగా..

kandikonda : కందికొండ కుమార్తె లేఖపై స్పందించిన minister ktr -గేయ రచయిత కుటుంబానికి అండగా..

కందికొండ యాదగిరి, మంత్రి కేటీఆర్

కందికొండ యాదగిరి, మంత్రి కేటీఆర్

కందికొండగా పాపులరైన రచయిత చాలా కాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతుండటం, చికిత్సకు భారీగా ఖర్చవుతుండటంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. తండ్రి అనారోగ్యం కారణంగా తమ కుటుంబం ఎదుర్కొంటున్న దుస్థితిని వివరిస్తూ కందికొండ కుమార్తె మాతృక రాసిన లేఖపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆదివారం తన ట్విటర్ ఖాతాలో మంత్రి కీలక ప్రకటన చేశారు..

ఇంకా చదవండి ...
తెలుగు సినిమాలతోపాటు తెలంగాణకు సంబంధించి ఎన్నో మరుపురాని పాటు రాసిన గేయ రచయిత కందికొండ యాదగిరి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భరోసా ఇచ్చారు. కందికొండగా పాపులరైన రచయిత చాలా కాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతుండటం, చికిత్సకు భారీగా ఖర్చవుతుండటంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. తండ్రి అనారోగ్యం కారణంగా తమ కుటుంబం ఎదుర్కొంటున్న దుస్థితిని వివరిస్తూ కందికొండ కుమార్తె మాతృక రాసిన లేఖపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆదివారం తన ట్విటర్ ఖాతాలో మంత్రి కీలక ప్రకటన చేశారు..

కందికొండ కుటుంబానికి గతంలోనూ అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఉంటామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కందికొండ కుటుంబం విషయంలో తన ఆఫీసు సిబ్బంది, మంత్రి తలసానితో మాట్లాడి సాయం చేస్తారని భరోసా ఇచ్చారు. గొంతు క్యాన్సర్ తో బాధపడుతోన్న కందికొండ యాదగిరికి కొద్ది నెలల కిందట ఆరోగ్యం విషమించడంతో పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. ఆయా సందర్భాల్లో మంత్రి కేటీఆర్‌ చొరవ తీసుకొని ఆయనకు మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు.

etela rajenderకు చెక్ పెడుతున్నారా? -తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటనలో అర్థం ఇదేనా?



ప్రస్తుతం కందికొండ ఆరోగ్యం నిలకడగా ఉన్నా.. ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఇంటి అద్దె చెల్లించలేకపోవడంతో ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూతురు మాతృక మంత్రికి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చిత్రపురి కాలనీ లేదా, ఇంకెక్కడైనా ఇల్లు ఇప్పించాలనీ మంత్రిని రిక్వెస్ట్ చేశారు. ట్విటర్‌ వేదికగా లేఖపై స్పందించిన కేటీఆర్‌ కందికొండ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Shadnagar : చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధం.. భర్త బయటికెళ్లగానే ప్రతిరోజూ.. చివరికి ఏమైందంటే..



తెలుగు సినీ గేయ రచయితగా కందికొండకు మంచి పేరుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' చిత్రంలో 'మళ్లి కూయవే గువ్వ' పాటతో ఆయన గేయ రచయితగా మారారు. ఆ తర్వాత 'ఇడియట్‌'లో 'చూపుల్తో గుచ్చి గుచ్చి', 'సత్యం'లో 'మధురమే మధురమే', 'ఐయామ్‌ ఇన్‌ లవ్‌', 'పోకిరి'లో 'గల గల పారుతున్న గోదారిలా' 'జగడమే', 'లవ్‌లీ'లో 'లవ్‌లీ లవ్‌లీ' తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో 'నీది నాది ఒకే కథ'లో రెండు పాటలు రాశారు. తెలంగాణ పండుగలైన బోనాలు, బతుకమ్మతోపాటు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే పలు పాటలను కందికొండ రాశారు.
Published by:Madhu Kota
First published:

Tags: KTR, Minister ktr, Telangana, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు