TRS Leaders meet Gaddar: గద్దర్‌తో టీఆర్ఎస్ నేతల మంతనాలు..కిషన్ రెడ్డితో భేటీ ఎఫెక్టా?

సీఎం కేసీఆర్, గద్దర్

TRS leaders Meets gaddar: హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంతో గద్దర్‌తో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉపఎన్నికల్లో మద్దతు కోసమే ఆయన్ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.

 • Share this:
  తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. హజురాబాద్ ఉపఎన్నికలు, రేవంత్ రెడ్డి వర్సెస్ మల్లారెడ్డి, బండి సంజయ్ పాదయాత్ర...ఇలా వరుస ఎపిసోడ్‌లతో రోజుకు రోజుకు సెగలు రేపుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శనివారం ప్రజా గాయకుడు గద్దర్‌తో టీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. అల్వాల్ భూదేవినగర్‌లోని నివాసంలో గద్దర్‌తో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చర్చలు జరిపారు. దాదాపు గంటకు పైగా వీరు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంతో గద్దర్‌తో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని, ఈ ప్రతిష్టాత్మక పథకంతో ఎంతో మంది పేద దళితులకు ప్రయోజనం చేకూరుతుందని వారు గద్దర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం కోసం మద్దతు ఇవ్వాలని ఆయన్ను కోరినట్లు సమాచారం. ఐతే గద్దర్‌ మాత్రం టీఆర్ఎస్ హామీ ఇవ్వలేదని, తటస్థంగా ఉండే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.

  వారం రోజుల క్రితం కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో గద్దర్ సమావేశమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి కిషన్‌రెడ్డితో చర్చించినట్లు తెలిసింది. తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కేసులపై చర్చించడానికి తనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కేంద్రమంత్రిని కోరారు కోరారు. కిషన్ రెడ్డితో భేటీ అయిన కొన్ని రోజుల్లోనే.. టీఆర్ఎస్‌ నేతలు గద్దర్‌తో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఎన్నికల్లో గద్దర్ బీజేపీకి మద్దతు తెలిపితే.. టీఆర్ఎస్‌కు ఇబ్బందులు వస్తాయని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. అందుకు అప్రమత్తమై.. గద్దర్‌ మద్దతు కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను పంపించారని ప్రచారం జరుగుతోంది. ఐతే గద్దర్‌తో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని.. కేవలం మర్యాదపూర్వకంగా కలిశారని చెబుతున్నారు.

  YS Vijayamma: వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది..? వైఎస్ హయాంలో మంత్రలకు విజయమ్మ ఆహ్వానం

  మరోవైపు హుజూరాబాద్‌లో ఉపఎన్నికల రాజకీయం రోజు రోజుకూ రసవత్తరంగా మారుతోంది. మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాక.. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. హుజూరాబాద్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్రతో ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికలను టీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే.. రానున్న రోజుల్లో రాజకీయంగా పెను మార్పులు వస్తాయని భావిస్తోంది. అందుకే ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నుంచే ప్రారంభించి.. సంచలనానికి తెరదీసింది. ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది.

  CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల లేఖ.. అందులో ఏముందంటే..

  అంతేకాదు అభ్యర్థి ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు సీఎం కేసీఆర్. ఉద్యమ నేపథ్యమున్న టీఆర్ఎస్వీ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌కు టికెట్‌ను ఖరారు చేశారు. కోటీశ్వరుడికి.. సామాన్యుడికి జరుగుతున్న యుద్ధమంటూ ప్రచారం చేస్తున్నారు గులాబీ నేతలు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. టీఆర్ఎస్‌తోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యమని.. ఈటల రాజేందర్ గెలిస్తే ప్రజలకు ఒరిగేదేం ఉండదని ప్రచారం చేస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: